వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్టు ఎక్కుతున్నారు, కుక్కలు, పిల్లులు, పాములు: అమిత్ షా తీవ్రవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

2019కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది...!

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల కోసం పార్టీలు అన్నీ చెట్లు ఎక్కుతున్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలను కుక్క, పిల్లి, పాములతో పోల్చారు.

బీజేపీ రెండు లోకసభ స్థానాల్లో ఓడిపోయిందని కాంగ్రెస్ చంకలు గుద్దుకుంటోందని, కానీ పదకొండు రాష్ట్రాల్లో మీరు ఓడిపోయారని, అవి తమ చేతికి వచ్చాయని వ్యాఖ్యానించారు. 2019కి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. మోడీ ఎగైనెస్ట్ ఫ్రంట్ సాధ్యం కాదన్నారు.

Countdown for 2019 has begun, says Amit Shah

విపక్షాలను కుక్కలు, పిల్లి, పాములతో పోలుస్తూ అవి చెట్టు ఎక్కుతున్నాయన్నారు. నరేంద్ర మోడీ ప్రపంచంలోనే పేరుగాంచిన ప్రధానమంత్రి అన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులను బీజేపీ కార్యకర్తలు అందరికీ తెలియజేయాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలన్నారు.

తాము రెండు సీట్లు కోల్పోతే కొందరు స్వీట్లు పంచుకున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. కానీ మీరు 11 రాష్ట్రాలు కోల్పోయారన్నారు. బీజేపీ ఇఫ్పుడు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. ఇది మా పార్టీకి ఎంతో సంతోషకరమన్నారు.

English summary
BJP chief Amit Shah compared party's opponents to cat, dogs, and snakes who "climb the tree for safety during a storm". By the dig, he implied that the party's wave will have a similar effect on the opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X