Congress Presidential Election : కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్-ఖర్గేకే ఛాన్స్

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడెవరో ఇవాళ తేలిపోనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ మధ్యాహ్నం వరకూ కొనసాగే అవకాశముంది. అయితే మధ్యలోనే విజేత ఎవరో తేలిపోగానే కౌంటింగ్ నిలిపేసే అవకాశముంది.

రెండు రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ముఖాముఖీ తలపడ్డారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు హైకమాండ్ కమాండ్ వీరిలో ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్ధులు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు ఎవరిని ఎన్నుకున్నారనే విషయం ఇవాళ తేలిపోనుంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 9915 మంది ప్రతినిధుల్లో 9500 మంది మాత్రమే ఓటేశారు.

counting of votes for congress presidential election begins in delhi aicc office

కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకపోవడం, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అదే సమయంలో పార్టీలో అసంతృప్త నేతలంతా కలిసి జీ23గా ఏర్పడి అధినేత్రికి లేఖలు రాయడం జరిగాయి. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికలకు తెరలేచింది. దీంతో అధినేత్రి సోనియా ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందనే విషయాన్ని నిరూపించాలని భావించారు. ఇప్పుడు అధ్యక్ష అభ్యర్దుల రేసులో ఉన్న ఖర్గే, థరూర్ కూడా ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+