పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని.. యువ ప్రేమజంట ఆత్మహత్య

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్‌లోని భోరాకుర్ద్‌ గ్రామానికి చెందిన రజనీష్‌(22), ఇమ్రానా(18)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే వారి సామాజిక వర్గాలు వేరుకావడంతో వారి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు.
దీంతో వారిద్దరూ ఆదివారం రాత్రి నుంచి కనిపించకుండాపోయారు. సోమవారం ఉదయం ఇద్దరూ ఊరి బయట చెట్టుకు ఉరేసుకుని కనిపించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారే ఆత్మహత్య చేసుకున్నారా? లేక పరువు హత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Couple commits suicide after parents say no to marriage in Muzaffarnagar

ఆస్తి కోసం అన్నని చంపిన తమ్ముడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖాంజహాపూర్‌ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం గొడపడి సొంత అన్ననే కాల్చి చంపాడో తమ్ముడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాంజహాపూర్‌ గ్రామంలో నివసించే ఆజాద్‌కు ప్రదీప్‌, సంజీవ్‌ ఇద్దరు కొడుకులు.

ఆస్తి తగాదాలతో ఆదివారం సంజీవ్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రదీప్‌ను కాల్చి చంపాడు. ఈ మేరకు ప్రదీప్‌ తండ్రి చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+