ట్వీట్ చేస్తే చాలు: ఆకతాయిల నుంచి కాపాడిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తనకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనకు ఏ ఫిర్యాదు అందినా.. క్షణాల్లో పరిష్కారమవ్వాల్సిందేనన్నట్లు ఆయన పని ఉంటోంది.

తమకు సమస్య ఉందని ఎవరైనా మంత్రి దృష్టి తీసుకెళ్తే.. వెంటనే దాన్ని పరిష్కరించేస్తారు. ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రభు పనితీరు అద్భుతమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై ఆయన క్షణాల్లో స్పందించిన విధానం పట్ల దేశ వ్యాప్తంగా అంతా ముగ్ధులవుతున్నారు.

Couple On Train Gets Help After Tweets To Railway Minister Suresh Prabhu

తాజాగా ఆయన ఓ ఆకతాయి గుంపు నుంచి దంపతులను రక్షించి శభాష్ అనిపించుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి అజ్మేరీ షరీఫ్-సెల్దాహ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ దంపతులు ప్రయాణిస్తున్నారు. వారు ఎక్కిన బోగీలోనే 20మంది వరకు యువకులు కూడా కూర్చున్నారు.

అయితే, వారందరూ కలిసి ఆ దంపతులను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆ దంపతులు కాన్పూర్, ఆగ్రా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. దీంతో ఆ దంపతులు రైల్వే మంత్రికి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో రైలు ధన్ బాద్ స్టేషన్‌కు రాగానే పోలీసులు వచ్చి ఆ దంపతులను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మిగిలినవారు పరారయ్యారు. దీంతో ఆ దంపతులు తమకు సాయం చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా తమ సమస్యలను చెబితే మంత్రి వేగంగా స్పందించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+