దారుణం: ప్రేమ జంటను నగ్నంగా మార్చి, ఊరంతా తిప్పుతూ కొట్టారు..

Subscribe to Oneindia Telugu

జైపూర్: వరుసలు కలవని ఇద్దరు రక్తసంబంధీకులు ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయారు. వారిని వెతికి మరీ పట్టుకొచ్చిన ఇరు వర్గాల వారు.. ఆ జంటపై తీవ్రంగా దాడి చేశారు. డప్పులు వాయిస్తూ నగ్నంగా మార్చి ఊరంతా తిప్పారు. కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా వారిని గాయపరిచారు.

రాజస్తాన్ లోని బన్‌స్వారా జిల్లాలో చోటు చేసుకన్న ఘటనకు సంబంధించి వీడియో బయటకు పొక్కడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. రక్త సంబంధీకులు కావడంతో ఇరువురి పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. అయితే వారి మాటను లెక్క చేయక ఆ జంట గత నెల 22న ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో వెతికి పట్టుకొచ్చి వారిని శిక్షించారు.

Couple Paraded Naked In Rajasthan, Cops Act After Video Goes Viral

ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేని స్థానిక పోలీసులు చెబుతున్నారు. కాగా, బాధిత యువతికి ఆమె కుటుంబం అదే గ్రామంలోని మరో యువకుడితో బలవంతపు పెళ్లి చేయడానికి ప్రయత్నించింది. ఇందుకు గాను ఆ కుటుంబానికి పెళ్లి కొడుకు కుటుంబం రూ.80వేలు చెల్లించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 18మందిని అరెస్టు చేసి, యువతిని రెస్క్యూ హోమ్ కు తరలించారు. యువతితో పాటు బాధిత యువకుడి నుంచి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young man and a woman were mercilessly beaten and tortured and paraded naked in a Rajasthan village because they had eloped. The 20-year-old woman was sexually assaulted and brutalised with a stick. 18 people have been arrested, including fathers of the man and woman, after videos of the attack went viral.
Please Wait while comments are loading...