పర్మిషన్ నో: రాష్ట్రపతి భవన్ ఎదుట బట్టలిప్పేసిన జంట
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు వచ్చిన ఓ జంట తమకు అనుమతి లభించక పోవడంతో బట్టలు విప్పి హంగామా చేశారు. ఈ సంఘటన సోమవారం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్ వద్ద జరిగింది. ఆ జంట వయస్సు సుమారు ముప్పయ్యేళ్లలో ఉంటుంది.
సోమవారం ఉదయం ఆ జంట రాష్ట్రపతి భవన్ వద్ద గల ప్రధాన గేటు వద్దకు వెళ్లారు. తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని అక్కడి భద్రతా సిబ్బందిని కోరారు. నిరాకరించడంతో డిమాండ్ చేశారు.

దీంతో భద్రతా సిబ్బంది వారిని ఎందుకు కలవాలో చెప్పాలని ప్రశ్నించారు. కానీ వారి వద్ద సమాధానం లేదు. దీంతో సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో ఆ జంట తమ దుస్తులు విప్పేశారట.
నిర్ఘాంతపోయిన భద్రతా సిబ్బంది దుస్తులు వేసుకోవాలని వారిని కోరారు. దోవతీ విప్పేసిన ఓ వ్యక్తి రైసినా హిల్స్ వైపు పరుగెత్తాడు. భద్రతా సిబ్బంది, పోలీసులు వారికి దుస్తులు వేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ జంటను పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications