కనిమొళి అరెస్టుకు వారంట్: క్షమాపణలతో రద్దు
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూతురు కనిమొళిపై ప్రత్యేక కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. కోర్టుకు ఆమె హాజరు కాకపోవడంతో కోర్టు ఆ వారంట్ జారీ చేసింది. అయితే, ఆమె తరఫు న్యాయవాది హాజరై క్షమాపణ చెప్పడంతో కోర్టు వారంట్‌ను రద్దు చేసింది.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సోమవారంనాడు కోర్టు డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళిపై అరెస్టు వారంట్ జారీ చేసింది. 2జి స్పెక్ట్రమ్ తుది విచారణకు డిసెంబర్ 19వ తేదీని కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో కనిమొళితో పాటు మాజీ టెలికమ్ మంత్రి ఎ రాజా, మరో 15 మంది నిందితులుగా ఉన్నారు.

సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపి సైనీ సోమవారంనాడు విచారణకు తీసుకున్నారు. అయితే, సిబిఐ, నిందితుల తరఫు న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. తన వాదనలను కొనసాగించడానికి తనకు మరింత సమయం కావాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోయర్ కోర్టును కోరారు.
మరింత మంది సాక్షులను సిబిఐ విచారిస్తున్న స్థితిలో తుది విచారణను ఎలా చేపడుతారంటూ కేసులో నిందితుడైన స్వాన్ టెలికమ్ ప్రమోటర్ షాహిద్ బాల్వా తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రశ్నించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి 30,984 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది. అయితే, ఆ స్పెక్ట్రమ్ లైసెన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications