వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: భారీగా తగ్గిన కేసులు -నిన్న 2.40లక్షల కేసులు, 3,741మంది మృతి -టీకాల కొరత తీరేదెన్నడు?

|
Google Oneindia TeluguNews

కొత్త కేసుల పరంగా దేశంలో కరోనా విలయ ప్రభావం కాస్త తగ్గినట్లు అనిపించినా, మరణాల సంఖ్య భారీగా కొనసాగుతుండటం కలవరపెడుతున్నది. రోజూ 20లక్షలపైచిలుకు శాంపిళ్లను పరీక్షిస్తుండగా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ, ఆదివారం నాటికి తాజా కనిష్టానికి చేరాయి. కేంద్ర సర్కారు అట్టహాసంగా ప్రకటించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. వివరాలివి..

కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,40,842 పాజిటివ్ కేసులు, 3,741 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,65,30,132, మొత్తం మరణాల సంఖ్య2,99,266కు పెరిగాయి.

covid-19 in india: records dip in daily cases, 240,842 new cases, 3,741 more deaths in last 24 hrs

నిన్న ఒక్కరోజే కొవిడ్ వ్యాధి నుంచి 3,55,102 మంది కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 2,34,25,467కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28,05,399 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,86,07,937 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,23,782 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇక,

Recommended Video

Chattisgarh : గూబగుయ్ మనిపించి సారీ చెప్పిన Collector, అసలు ట్విస్ట్ ఇదే!! || Oneindia Telugu

దేశంలో వైరస్ ఉధృతిలో మార్పులు వస్తున్నప్పటికీ వ్యాక్సిన్ల లభ్యతలో మాత్రం ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ మార్పుల్లేవు. టీకాల కొరత కొరత కారణంగా కేంద్ర సర్కార్ అట్టహాసంగా తలపెట్టిన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నదానికంటే చాలా నిదానంగా సాగుతున్నది. శనివారం నాటికి దేశ వ్యాప్తంగా 19,50,04,184 డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

English summary
The daily rise in coronavirus cases in India remained below the 3 lakh-mark for the seventh consecutive day, with 2.4 lakh new cases recorded in a single day, the Union Health Ministry said on Sunday. With the fresh cases, India's tally of COVID-19 cases climbed to 2,65,30,132. The death toll due to the disease rose to 2,99,266 with 3,741 fresh fatalities, the ministry data updated at 8 am showed. The active cases further reduced to 28,05,399 comprising 10.57 per cent of the total infections, while the national COVID-19 recovery rate improved to 88.30 per cent. The number of people who have recuperated from the disease in the country surged to 2,34,25,467 while the case fatality rate stood at 1.13 per cent, the data stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X