Coronavirus Cases India ఒక్కరోజే 1553 పాజిటివ్ కేసులు, 17 వేల మార్క్ దాటిన సంఖ్య, 543 మంది మృతి..!
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1553 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 17 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 17 వేల 265 కాగా.. 2546 మంది కోలుకోవడంతో ఇంటికి పంపించారు. 14 వేల 715 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 543కి చేరింది.
Recommended Video
గత 24 గంటల్లో ఇండోర్‌లో వైరస్ సోకిన ముగ్గురు చనిపోయారు. దీంతో మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 52కి చేరింది. మరో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. వీరితో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 897కి చేరింది. బీహార్‌లో మూడు పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 96కి చేరింది. ఇద్దరు చనిపోగా.. 42 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. గుజరాత్లో మరో 108 మందికి వైరస్ సోకింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1851కి చేరింది. రాష్ట్రంలో మరో నలుగురు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కి చేరింది. జమ్ముకశ్మీర్‌లో మరో 4 పాజిటివ్ కేసులు నమోదుతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 354కి చేరింది.

ఒడిశాలో మరో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 68కి చేరింది. ఇందులో 43 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఒకరు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. రాజస్థాన్‌లో మరొకరు చనిపోగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 24కి చేరింది. జైపూర్‌లోనే 13 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం మరో 17 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1495కి చేరింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications