వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: భారీ రికార్డు -97శాతానికి రికవరీ రేటు -కొత్తగా 13,052 కేసులు, 127 మరణాలు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రపంచ దేశాల నుంచి అభినందనలు అందుకుంటోన్న భారత్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంకాగా, కొవిడ్ వ్యాధి రికవరీ రేటులో సరికొత్త రికార్డు నమోదైంది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్త కేసులు, మరణాల ఉధృతి తగ్గింది..

కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ లోని వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7,50,964 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183కి చేరింది. నిన్న ఒక్కరోజే 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,54,274కు పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులుషాకింగ్: కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయింది -కాసిపేట అంగన్‌వాడీ కార్యకర్త మృతిపై బంధువులు

 covid-19: Indias recovery rate climbs to 96.99%, 13,052 new cases, 127 deaths in last 24hrs

ప్రపంచ దేశాలకంటే ఎంతో మెరుగ్గా భారత్ లో కొవిడ్ రికవరీ రేటు పెరుగుతోంది. శనివారం నాటికి అది 96.99 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక, గడిచిన 24 గంటల్లో 13,965 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,04,23,125కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,784కు తగ్గింది. ఇక..

తెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలుతెలంగాణలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 163 కేసులు, ఒకరి మృతి -నేడు పల్స్ పోలియో టీకాలు

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నవారి సంఖ్య 37,44,334కు చేరింది. తొలి విడతలో పారిశుద్ధ్య కార్మికులు,ఆరోగ్య సిబ్బంది సహా ఫ్రంట్ లైన్ వారియర్లు, ఎమర్జెన్సీ కేసులు కలిపి 30 కోట్ల మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

English summary
With 13,052 new coronavirus infections being reported in a day, India's COVID-19 tally has gone up to 1,07,46,183, while the number of people who have recuperated from the disease has surged to 1,04,23,125, according to the Union Health Ministry data updated on Sunday. The national recovery rate has climbed to 96.99 per cent. The death toll increased to 1,54,274 with 127 new fatalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X