కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటన

దేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైపు కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుంటోన్న వాళ్ల సంఖ్య భారీగా ఉంటుండటం సంతోషకరం. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల్లో కొత్త కేసులకు దీటుగా డిశ్చార్జీల సంఖ్య ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,509 కొత్త కేసులు, 857 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51,706 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన డిశ్చార్జిల్లో ఇదే అత్యధిక సంఖ్య కావడం విశేషం.

covid-19: Indias recovery rate rises to 67.19%, says Union health ministry

కొత్తవాటితో కలిపి దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పటివరకు 19.13 లక్షలకు పెరిగింది. మరణాల సంఖ్య 40 వేలకు చేరువైంది. గడిచిన24 గంటల్లో 51,706 రికవరీలతో కలిపి మొత్తం 12.84 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5.88లక్షలుగా ఉంది.

జులై చివరి మూడో వారంలో 63 శాతంగా ఉన్న రికవరీ రేటు.. ప్రస్తుతానికి(మంగళవారం నాటికి) 67.19 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మరణాల రేటు 4 శాతంగా ఉండగా, ఇండియాలో మాత్రం అది 2.09 శాతంగా ఉంది. ఇప్పటిదాకా 2.14 కోట్ల శాంపిళ్లను పరీక్ష చేసినట్లు కేంద్రం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+