వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: వరుసగా 7వరోజు -దేశంలో కొత్తగా 36,011 కేసులు, 482 మరణాలు -భారీగా రికవరీలు

|
Google Oneindia TeluguNews

13 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.7కోట్లకు, మరణాలు 15.4లక్షలకు పెరిగాయి. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుండగా, భారత్ లో మాత్రం వైరస్ వ్యాప్తి ఒకింత కంట్రోల్ లోకి వస్తున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

Recommended Video

COVID-19 Vaccine : 1,600 Million చొప్పున టీకా మోతాదును అత్యధికంగా కొనుగోలు చేసిన దేశంగా India

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36, 011 కొత్త కేసులు, 482 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96లక్షల 44వేల 222కు, మరణాల సంఖ్య 1లక్షా 40వేల 182కు పెరిగాయి. వరుసగా ఏడు రోజులపాటు.. అంటే గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా కొత్త కేసుల సంఖ్య 40వేలకు దిగువన నమోదు అవుతుండటం గమనార్హం.

భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానేభారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానే

covid-19: Indias tally over 96.44 lakh with 36,011 new cases, 482 deaths in 24 hours

కొత్త కేసులు తగ్గుతుండటంతోపాటే డిశ్చార్జీలు భారీగా ఉండటం శుభపరిణామం. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 41,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటిదాకా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 91లక్షల 792కు పెరిగింది. ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా భారత్ లో రికవరీ రేటు 94.37 శాతం ఉన్నట్లు ారోగ్య శాఖ తెలిపింది.

తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్‌లో ఘటన -షాకింగ్ కారణంతిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్‌లో ఘటన -షాకింగ్ కారణం

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4.18శాతాని తగ్గాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 2వేల 4గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.01లక్షల టెస్లులను చేపట్టారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 14.7కోట్లకు చేరింది. పలు ఫార్మా సంస్థలు తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో సమర్థవంతంగా పనిచేస్తుండటంతో వాటిలో కొన్నింటిని అత్యవసర వినియోగానికి లేదా సామూహిక వినియోగానికి ఆమోదించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ వచ్చే కొద్ది వారాల్లోనే మొదలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం తెలిసిందే.

English summary
India's COVID-19 caseload rose to 96,44,222 with 36,011 new cases in a day, while 91,00,792 people have recuperated from the disease so far, according to the Union health ministry data. The death toll climbed to 1,40,182 with the coronavirus claiming 482 lives in a span of 24 hours in the country, the data updated at 8 am showed. There are 4,03,248 active cases of coronavirus infection in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X