Covid Cases : ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు..
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన కోవిడ్ కేసులు..దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత సంవత్సరం మే తర్వాత ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కరోనా మరోసారి వేగంగా పుంజుకుంటుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్తరాదిలోని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. గడిచిన పదిహేను రోజుల నుంచి దేశరాజధాని ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యి రికార్డులు చెబుతున్నాయి. ఇక, రాజస్తాన్ రాష్ట్రంలో కూడా గడిచిన పదిహేను రోజుల్లో కొత్తగా 226 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా కోవిడ్ 19 పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టెస్టింగ్ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నిజానికి పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

యూపీ, బీహార్‌లో కూడా కేసుల సంఖ్య గణనీయం...ఇక, ఈ సంవత్సరం చలికాలంలో ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినా అవి స్వల్పంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఒకే రోజు 50 కన్నా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం గత సంవత్సరం మే నెల తర్వాత ఇదే మొదటిసారి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఉత్తరాదిలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అందులో యూపీ, బీహార్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన పదిహేను రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో 164 కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బీహార్‌లో కూడా 14 నుంచి కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా103కు చేరుకున్నది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications