వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా మృతదేహాల నుంచి వ్యాప్తి చెందుతుందా? జాగ్రత్తలేంటీ?: ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనాతో మరణించినవారితో ఇతరులకు ఆ మహమ్మారి సోకుతుందా? అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఎందుకంటే.. కరోనాతో మరణించినవారి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సొంత కుటుంబసభ్యులు కూడా దూరంగానే ఉంటున్నారు. దీంతో వైద్య సిబ్బంది లేదా మున్సిపల్ సిబ్బందే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.

కరోనా మృతిచెందినవారిలో వైరస్ ఒకరోజుకు మించి బతకదు

కరోనా మృతిచెందినవారిలో వైరస్ ఒకరోజుకు మించి బతకదు

అయితే, కరోనాతో మృతి చెందినవారి శరీరం నుంచి కరోనా ఇతరులకు సోకుతుందా? అనే విషయంపై ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా స్పష్టతనిచ్చారు. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత కరోనావైరస్ బతకలేదని తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫొరెన్సిక్ మెడిసిన్ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా..

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా..

కరోనా వైరస్ బారినపడి చనిపోయినవారి మృతదేహాలను 100కుపైగా పరీక్షించినట్లు గుప్తా వెల్లడించారు. ఈ సందర్భంగా మృతదేహాలను మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే 12-24 గంటల తర్వాత ఆ వ్యక్తి ముక్కు, శరీరంలో వైరస్ బతికి ఉండలేదని గుర్తించినట్లు తెలిపారు. శవాల నుంచి వైరస్ వ్యాప్తి జరగడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయన్నారు. అయితే, ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసివేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్ చేయాలని సూచించారు.

Recommended Video

Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
కరోనా మృతుల అంత్యక్రియల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనా మృతుల అంత్యక్రియల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇక కరోనాతో మరణించినవారి అంత్యక్రియల్లో పాల్గొనేవారు ముందస్తు రక్షణగా ఖచ్చితంగా మాస్కులు, చేతికి గ్లౌవ్స్, పీపీఈ కిట్లు ధరించాలని డాక్టర్ గుప్తా స్పష్టం చేశారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం చితాభస్మం సేరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు. అప్పుడు కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. చనిపోయినవారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే తాము ఈ అధ్యయనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకపోవడం మంచిదని ఇప్పటికే ఐసీఎంఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
Coronavirus doesn’t remain active in nasal and oral cavities 12 to 24 hours after the death of an infected person as a result of which the risk of transmission from the deceased is highly unlikely, AIIMS Forensic Chief Dr Sudhir Gupta said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X