వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవు పేడతో చిప్‌- రేడియషన్‌ నుంచి విముక్తి- శాస్త్ర్రీయంగా నిరూపణ అయిందంటున్న కేంద్రం..

|
Google Oneindia TeluguNews

ఆవు పేడ హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పటికే ఎన్నో ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర్రీయ కామథేను ఆయోగ్‌ అనే సంస్ధ ఆవుపేడతో చిప్‌ తయారు చేసింది. అంతే కాదు ఈ చిప్‌తో రేడియేషన్‌ను సమర్దవంతంగా ఎదుర్కోవచ్చని కూడా చెబుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపణ అయిందని సంస్ధ ఛీఫ్‌ కటారియీ చిప్‌ విడుదల సందర్భంగా ప్రకటించారు.

దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడమే కాకుండా వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహిచేందుకు కేంద్రం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ సంస్ధను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ గోవులకు సంబంధించిన ప్రతీ ఉత్పత్తిని శాస్త్రీయంగా పరీక్షించి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ను సంస్ధ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్‌ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది. గౌసత్వ కవచ్ పేరుతో రూపొందిన ఈ చిప్‌ను గుజరాత్‌కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది.

cow dung chip protects against radiation, proven scientifically : RKA Chief

Recommended Video

Corona Spreading With Eyes : Research

రేడియేషన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆవు పేడతో తయారు చేసిన చిప్‌ విడుదల సందర్భంగా రాష్ట్రీయ కామథేను ఆయోగ్‌ ఛీఇఫ్‌ కటారియా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ ఆవు పేడను తింటారని, గోమూత్రం కూడా తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను స్వయంగా అక్షయ్ కుమార్‌ ప్రస్తావించిన విషయాన్ని కటారియా గుర్తుచేశారు.

English summary
Rashtriya Kamdhenu Aayog chairman Vallabhbhai Kathiria has said that cow dung has the capacity to counter and reduce radiation and it has been proven scientifically. Kathiria also unveiled a chip developed from cow dung.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X