వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గో మూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్ నయమవుతోందట.. బీజేపీ నేత కొత్త భాష్యం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంలో కూడా రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అసోం బీజేపీ నేత మాత్రం కొత్త భాష్యం చెప్పారు. వైరస్‌కు మందు ఇదేనంటూ సెలవిచ్చారు.

ఇదీ పరిష్కారం..?

ఇదీ పరిష్కారం..?


అసోంలోని హజో అసెంబ్లీ నుంచి సుమన్ హరిప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా వైరస్‌తో జనం బెంబేలెత్తుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం వైరస్ గాలితో వస్తుందని.. ఇందుకు గో మూత్రం, ఆవు పేడ పరిష్కార మార్గం అని చెప్పారు. ఇవీ తీసుకుంటే వైరస్ వెళ్తుందని, మళ్లీ దరి చేరదని కూడా చెప్పారు. అంతేకాదు అగ్ని ముందు దేవళ్లను ఆరాధిస్తే కూడా మంచి జరుగుతోందని... వైరస్ రాదని చెప్పారు. వైరస్ ప్రబలిన చైనాలో ఆవు పేడను ఉపయోగిస్తే.. అక్కడ గాలి స్వచ్ఛంగా మారుతోందని చెప్పారు.

5 కి.మీ వరకు

5 కి.మీ వరకు

ఆవు పేడ చల్లిన 5 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. దీనిని తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుంటుందని ఉచిత సలహా ఇచ్చారు. పురాతన కాలంలో సాధువులు గో మూత్రం, పాలు, తేనే కలిసి తీసుకొనేవారని గుర్తుచేశారు. పంచామృతం తీసుకోవడం వల్ల వారు వేలాది సంవత్సరాలు జీవించారని చెప్పారు. గో మూత్రం, ఆవు పేడను చాలారకాల మందుల్లో పూర్వీకులు వాడేవారని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆశ్రమాల్లో ఆవులు ఉండేవని.. వాటితో ఆరోగ్యానికి కావాల్సిన మందులు తయారుచేసేవారని చెప్పారు.

Recommended Video

Golkonda Crafts Bazaar Impress Telangana People | Oneindia Telugu
క్యాన్సర్ కూడా..

క్యాన్సర్ కూడా..

ఆవుపేడతో క్యాన్సర్ రక్కసిని కూడా నయం చేయొచ్చని సుమన్ పేర్కొన్నారు. కానీ తమ సోదరుడికి కూడా ప్రకృతి వైద్యం ఇప్పించలేకపోవడంతో చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌లోని ఆయుర్వేద వైద్యశాల ద్వారా క్యాన్సర్‌ నయం చేయొచ్చని సూచించారు. ప్రాకృతిక వైద్యంతో కరోనా వైరస్‌ను తరిమి కొట్టేచ్చని సుమన్ సూచిస్తోండగా.. ఆమె వ్యవహారశైలిపై కొందరు పెదవి విరుస్తున్నారు.

English summary
BJP MLA Suman Haripriya from Assam made a bizarre statement suggesting people to use cow urine and dung to treat the deadly virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X