కేరళ స్థానిక సంస్థల్లో ఎల్డీఎఫ్ హవా .. ఖాతా తెరువని బీజేపీ
తిరువనంతపురం : ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల మాదిరిగానే .. కొన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ పట్టు కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా కేరళలో శబరిమల ఆలయ ప్రవేశం .. బీజేపీని ఇరకాటంలో పడేసింది.
ఖాతా తెరవని బీజేపీ
కేరళలోని స్థానిక సంస్థలకు శనివారం ఉప ఎన్నికలు జరిగాయి. దాదాపు 30 చోట్ల ఎన్నికలు జరుగ్గా బీజేపీ ఒక్క సీటు గెలుచుకోవడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. అధికార సీపీఎం నేత్రుత్వంలోని ఎల్డీఎఫ్ 16 స్థానాలు గెలుచుకొని తిరుగులేని శక్తిగా అవతరించింది.

అతివిశ్వాసమే ముంచిందా ..?
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశం తమకు కలిసి వస్తోందని బీజేపీ భావించింది. పైగా ఉప ఎన్నికల్లో దానిని ఆ పార్టీ నేతలు ప్రస్తావించారు. కానీ ప్రజలు మాత్రం బీజేపీ ఆశలపై నీళ్లుచల్లారు. 30 పంచాయతీ, నగర పాలక సీట్లలో ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వకపోవడం శబరి అంశంపై ప్రజలకున్నా ఆగ్రహ ఆవేశాలకు అద్దం పడుతోంది.
12 సీట్లు గెలిచిన యూడీఎఫ్
కాంగ్రెస్ ఆద్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 12 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచింది. కోజికోడ్, అలప్పుజ, ఆన్చియం జిల్లాల్లో యుడీఎఫ్ ప్రభావం చూపింది. ఆ పార్టీ నేతలు విజయం సాధించారు.












Click it and Unblock the Notifications