టీవీ ఛానెల్ డిబేట్... గెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో సెక్స్ టాయ్... అవాక్కయిన ప్రేక్షకులు...
అదో టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం... కరోనా మహమ్మారి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశంపై చర్చిస్తున్నారు... చాలామంది ప్రేక్షకులు లైవ్ వీక్షిస్తున్నారు... కానీ ప్రేక్షకుల దృష్టి నిపుణులు చర్చిస్తున్న అంశంపై కాకుండా మరో దానిపై పడింది... అదే 'సెక్స్ టాయ్'.. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళా గెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న షెల్ఫ్‌లో ప్రేక్షకులకు అది కనిపించింది. ఇంకేముంది... అసలు టాపిక్ కంటే సోషల్ మీడియాలో దీనిపై చర్చ ఎక్కువైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెట్టే అమోస్... విమెన్ గెస్ట్...
మంగళవారం(జనవరి 26) రాత్రి బీబీసీ వేల్స్ ఛానెల్ కొంతమంది నిపుణులతో ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన నిరుద్యోగంపై అందులో చర్చించారు. ఈ కార్యక్రమంలో వెట్టే అమోస్ అనే మహిళ గెస్టుగా పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయి తాను పడ్డ కష్టాల గురించి అందులో ఆమె వివరించారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. కానీ ఆమె సీటు వెనకాల ఉన్న బుక్ షెల్ఫ్‌లో 'సెక్స్ టాయ్' కనిపించడంతో చాలామంది ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్...
బుక్స్‌తో నిండిన ఆ షెల్ఫ్‌లో సెక్స్ టాయ్ కనిపించడంతో.. చాలామంది ఆ డిబేట్ కంటే దీనిపైనే సోషల్ మీడియాలో డిబేట్ చేయడం మొదలుపెట్టారు. మొదట జర్నలిస్ట్ గ్రాంట్ టక్కర్ దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'బహుశా బీబీసీ వేల్స్ వార్తా కార్యక్రమంలో ఇదే గొప్ప అతిథి బ్యాక్ గ్రౌండ్‌గా నిలవచ్చు. లైవ్‌లో పాల్గొనే ముందు మీ షెల్ఫ్‌లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.' అంటూ గ్రాంట్ టక్కర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భిన్నాభిప్రాయాలు...
కొంతమంది నెటిజన్లు మాత్రం ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదని పేర్కొంటున్నారు. అసలది సెక్స్ టాయ్ అని ఎందుకనుకోవాలి... ఏదైనా స్కల్పచర్ అయి ఉండొచ్చు కదా అని అంటున్నారు. మరో నెటిజన్ 'బ్యాక్ గ్రౌండ్‌లో సెక్స్ టాయ్ ఉన్న విషయాన్ని ఆమె గమనించకపోయి ఉండొచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. నేనైతే అలా అనుకోవట్లేదు. నాకు తెలిసి ఆమె ఓ సామాజిక ప్రయోగం చేస్తున్నట్లుంది. దీనిపై వచ్చే రియాక్షన్స్ ఆమె టాపిక్‌కి థీసిస్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.' అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
Recommended Video

స్పందించని అమోస్...
వెట్టే అమోస్ తల్లి దీనిపై మాట్లాడుతూ... ఈ విషయంపై తాను ఇంకా తన కుమార్తెతో మాట్లాడలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అదేమీ తనను అంతగా ఇబ్బంది పెట్టలేదన్నారు. తన కుమార్తె చాలా తెలివైన అమ్మాయి అని... దీనివల్ల ఆమెకేమీ ఇబ్బందులు వస్తాయని తాను అనుకోవట్లేదని అన్నారు. ఆమె తండ్రి కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు వెట్టే మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications