Criminal: జైల్లో ఉండే క్రిమినల్ లాడ్జ్ లో అమ్మాయితో నగ్నంగా ?, బయట పోలీసులు యూట్యూబ్ ? క్లేమాక్స్ లో !

బెంగళూరు/ధారవాడ/బళ్లారి: హత్య కేసులో ఓ క్రిమినల్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైల్లో ఉన్న క్రిమినల్ కొందరు జైలు సిబ్బంది సహకారంతో లగ్జరీ లైఫ్ గడపడం మొదలుపెట్టాడు. జైల్లో ఉన్నతస్థాయి అధికారులు సోదాలు చేసిన సమయంలో ఆ క్రిమినల్ దగ్గర గంజాయి చిక్కింది. ఆ సందర్బంలో పోలీసుల మీద ఆ క్రిమినల్ దాడి చేశాడు. దెబ్బకు క్రిమినల్ ను వేరే జిల్లాలోని సెంట్రల్ జైలుకు పంపించారు. హత్య కేసు విచారణకు క్రిమినల్ ను భారీ బందోబస్తుతో కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత క్రిమినల్ ను భారీబందోబస్తుతో సెంట్రల్ జైలుకు పిలుచుకుని బయలుదేరారు. అయితే క్రిమినల్ అతని గర్ల్ ఫ్రెండ్ తో ఓ ప్రైవేట్ లాడ్జ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ స్థానిక పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది. లాడ్జ్ లో క్రిమినల్ లేడీతో ఎంజాయ్ చేస్తుంటే లాడ్జ్ బయట పోలీసులు యూట్యూబ్ చూస్తూ కాలం గడపడం హాట్ టాపిక్ అయ్యింది.

హత్య కేసులో క్రిమినల్

హత్య కేసులో క్రిమినల్


కర్ణాటలోని ధారవాడలో గతంలో ఫ్రూట్ ఇర్ఫాన్ అలియాస్ ఇర్ఫాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ఫ్రూట్ ఇర్ఫార్ హత్య జరిగిన సందర్బంలో హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లో కలకలం రేపింది. ఫ్రూట్ ఇర్ఫాన్ హత్య కేసులో బచ్చా ఖాన్ అలియాస్ బచ్చా దాదాను స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్

సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్

ధారవాడ జైల్లో ఉన్న క్రిమినల్ బచ్చా ఖాన్ కొందరు జైలు సిబ్బంది సహకారంతో లగ్జరీ లైఫ్ గడపడం మొదలుపెట్టాడు. సెంట్రల్ జైల్లో ఉన్నతస్థాయి అధికారులు సోదాలు చేసిన సమయంలో క్రిమినల్ బచ్చా ఖాన్ దగ్గర గంజాయి చిక్కింది. ఆ సందర్బంలో పోలీసుల మీద బచ్చా ఖాన్ దాడి చేశాడు. పోలీసుల మీద దాడులు కేసిన కేసులో బచ్చా ఖాన్ కు శిక్షపడింది.

దెబ్బకు బళ్లారి సెంట్రల్ జైల్ కు షిఫ్ట్

దెబ్బకు బళ్లారి సెంట్రల్ జైల్ కు షిఫ్ట్

గంజాయి సేవించి ఎంజాయ్ చెయ్యడమే కాకుండా పోలీసుల మీద దాడిచేసిన బచ్చా ఖాన్ ను ధారవాడ సెంట్రల్ నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే బళ్లారి సెంట్రల్ జైల్లో కూడా బచ్చా ఖాన్ అతని దందాలు కొనసాగించాడని ఆరోపణలు ఉన్నాయి. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉంటున్న బచ్చా ఖాన్ ధారవాడలో జరుగుతున్న కోర్టు విచారణకు భారీ బందోబస్తు మద్య వెళ్లి వస్తున్నాడు.

 లాడ్జ్ లో గర్ల్ ఫ్రెండ్ తో నగ్నంగా చిక్కిపోయిన క్రిమినల్

లాడ్జ్ లో గర్ల్ ఫ్రెండ్ తో నగ్నంగా చిక్కిపోయిన క్రిమినల్


ఫ్రూట్ ఇర్ఫాన్ హత్య కేసు విచారణకు క్రిమినల్ బచ్చా ఖాన్ ను భారీ బందోబస్తుతో ధారవాడ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు విచారణ పూర్తి అయిన తరువాత బచ్చా ఖన్ ను భారీబందోబస్తుతో బళ్లారి సెంట్రల్ జైలుకు పిలుచుకుని బయలుదేరారు. అయితే క్రిమినల్ బచ్చా ఖాన్ సత్తూరులోని ఓ ప్రైవేట్ లాడ్జ్ లో అతని గర్ల్ ఫ్రెండ్ తో నగ్నంగా ఎంజాయ్ చేస్తూ స్థానిక పోలీసులకు చిక్కిపోవడం కలకలం రేపింది.

 క్రిమినల్ ఎంజాయ్ చేస్తుంటే బయట పోలీసులు ?

క్రిమినల్ ఎంజాయ్ చేస్తుంటే బయట పోలీసులు ?

బచ్చా ఖాన్ ను అదుపులోకి తీసుకున్న స్పెషల్ టీమ్ పోలీసులు అతన్ని విద్యాగిరి పోలీసులకు అప్పగించడంతో మరో కేసు నమోదు అయ్యింది. బళ్లారి సెంట్రల్ జైలు నుంచి ధారవాడ కోర్టు విచారణకు హాజరౌతున్న బచ్చా ఖాన్ ప్రతిసారి సత్తూరు పరిసర ప్రాంతాల్లోని లాడ్జ్ ల్లో అతని గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు పక్కాప్లాన్ తో అతన్ని అరెస్టు చేశారు.

మాఫియా మూఠాలతో లింక్ ?

మాఫియా మూఠాలతో లింక్ ?


బచ్చా ఖాన్ ను లాడ్జ్ కు పంపించి అతను గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం ఇచ్చిన నలుగురు భద్రతా సిబ్బంది (జైళ్ల శాఖ పోలీసులు)ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని హుబ్బళి-ధారవాడ పోలీసు కమీషనర్, బళ్లారి జిల్లా ఎస్పీ వేర్వేరుగా మీడియాకు చెప్పారు. మొత్తం మీద మాఫియా లీడర్ గా చలామణి అవుతున్న క్రిమినల్ బచ్చా ఖాన్ అతని గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ పోలీసులకు చిక్కిపోవడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+