మణిపూర్ కాంగ్రెస్ లో సంక్షోభం..! 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా..!!
మణిపూర్/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌కు మరోసారి షాక్ తగిలింది. మణి పూర్ లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన వీరు భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించడంతో వారిలో ఒక సీనియర్ ఎమ్మెల్యే స్పందించారు.
ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరబోయే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో ఒక దానిని బీజేపీ గెల్చుకోగా, రెండో దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది.దీంతో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామా పత్రాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు గయ్‌ఖంగంకు అందించారు.

అనంతరం వారిలో ఎనిమిది మంది భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో భాజపా ఎమ్మెల్యేల సంఖ్య 21 నుంచి 29 చేరింది. మేం ఇతర పార్టీలో చేరేందుకు రాజీనామా చేయలేదు. ఈ రాజీనామాల అనంతరం మా నియోజకవర్గాల్లో అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రజలకు పార్టీపై మళ్లీ నమ్మకం కలిగేలా చేస్తాం అంటూ మణిపూర్ పీసీసీ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన కెహెచ్ జాయ్‌కిషన్ సింగ్ పేర్కొన్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications