తమిళనాట సీన్ రివర్స్-తాజా అంచనాల్లో హంగ్ ? కింగ్ మేకర్ విజయ్..!

తమిళనాడు (Tamil Nadu)లో ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీనికి కారణం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య సాగుతున్న హోరాహోరీ పోరు, వీరికి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న టీవీకే అధినేత విజయ్. ఈ ముగ్గురి మధ్య పోరులో అనూహ్య ఫలితాలు తప్పవనే విశ్లేషణలు స్ధానికంగా వినిపిస్తున్నాయి. డీఎంకేపై ప్రజా వ్యతిరేకత, అన్నాడీఎంకే నాయకత్వ లేమి కారణంగా ఓట్లు భారీగా చీలి విజయ్ లబ్ది పొందుతున్నట్లు తెలుస్తోంది.

Tamil Nadu Polls: పళనిస్వామికి ఘోర అవమానం ..! దిగిపొమ్మన్న మోడీ..!
Tamil Nadu Polls: పళనిస్వామికి ఘోర అవమానం ..! దిగిపొమ్మన్న మోడీ..!

ఇదే క్రమంలో తమిళనాడులో సినీ విమర్శకుడు, విశ్లేషకుడు అక్షయ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై తన తుది అంచనాల్ని వెల్లడించారు. ఇందులో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదని ఆయన తేల్చారు. డీఎంకే, ఏడీఎంకే కూటములు రెండూ చెరో 80-90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందులో డీఎంకేకు స్వల్ప ఆధిక్యత ఉంటుందన్నారు. విజయ్ పార్టీ టీవీకే 25-27% ఓట్లు సాధించి, 25-35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అక్షయ్ వెల్లడించారు.

Critic Akshay s Bold Tamil Nadu Poll Call DMK-ADMK 80-90 Seats TVK 25-35 Vijay Backs DMK
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ మార్కు సీట్లు ఎవరికీ రావని, ఈ తరుణంలో డీఎంకే, అన్నాడీఎంకే రెండు కూటములు కూడా మరోసారి విజయ్ ను సంప్రదించి మద్దతు కోరతాయని అక్షయ్ తెలిపారు. దీంతో దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకేకు పలు షరతులతో బయటి నుండి మద్దతు ఇస్తారని అంచనా వేస్తున్నారు. రాబోయే 3-5 సంవత్సరాలలో టీవీకేను నియంత్రించడం డీఎంకేకు కష్టంగా ఉండవచ్చని, ఆయన డిమాండ్లలో చాలా వాటికి అంగీకరించాల్సి రావచ్చని కూడా జోస్యం చెప్పారు. దీంతో డీఎంకే కూటమిలో విజయ్ కూడా భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+