వీడియో వైరల్: బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసిన జవాన్లు..గ్రాండ్‌గా న్యూఇయర్ వేడుకలు
Recommended Video
న్యూఢిల్లీ: కొత్త సంవత్సర వేడుకలను అంతా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెబుతాం. అయితే దేశంలో మన భద్రత కోసం నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లు కూడా ఈ సారి న్యూఇయర్‌కు గ్రాండ్ వెల్కం చెప్పారు. నిత్యం విధుల్లో మునిగిపోయి ఉండే జవాన్లు కొత్త సంవత్సరం సందర్భంగా డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడా వీడియో ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది.
ఎముకలు కొరికే చలిలో జవాన్లు న్యూఇయర్ వేడుకలు
2019కి వీడ్కోలు పలుకుతూ 2020కి మనమంతా స్వాగతం పలికాం. మన స్నేహితులతోనో లేక కుటుంబ సభ్యులతోనో కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నాం. కానీ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు మాత్రం వేడుకను జరుపుకునేందుకు స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ దగ్గరుండరు. సరిహద్దుల్లో ఉన్నసమయంలో వారికంతా సహచర జవాన్లే. ఇక కొత్త సంవత్సరంను తమదైన శైలిలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు జవాన్లు. అర్థరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ కేకలు వేస్తూ సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం మొత్తం వేడుకలు ఒకలా జరుపుకుంటుంటే... ఎముకలు కొరికే చలిలో జవాన్లు వేడుకలను జరుపుకున్నారు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు వేడుకలు జరుపుకుంటూ సరిహద్దుల్లో నిఘా పెట్టారు.
బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసిన జవాన్లు
జవాన్లకు ఒక పండుగంటూ ఏమీ ఉండదు. నిత్యం దేశభద్రత కోసం శతృవులు దేశంలోకి సరిహద్దుల మీదుగా రాకుండా అడ్డుకోవడంతోనే వారి రోజువారి విధులు ముగుస్తాయి. మనం ఈ రోజు తృప్తిగా కంటిమీద కునుకు తీస్తున్నామంటే అంతుకు కారణం సరిహద్దుల్లో ఉన్న జవాన్లే కారణం అని చెప్పక తప్పదు.ఎముకలు కొరికే చలిలో కూడా పహారా కాస్తూ దేశంలో మన భద్రత కోసం తపిస్తుంటారు. అయితే కొత్త సంవత్సరం వస్తుందంటే కచ్చితంగా ఆటాపాటా ఉండాల్సిందే. ఓ వైపు పహారా కాస్తూనే సీఆర్‌పీఎఫ్ ఐటీబీపీ జవాన్లు రాయ్‌పూర్ మరియు ఔలీల్లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు వేస్తూ కొత్త సంవత్సరంను చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జవాన్లకు సలాం అంటున్న నెటిజెన్లు
ఉత్తరాఖండ్‌లోని ఔలీలో చలి తీవ్రత మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉంది. అయినప్పటికీ ఆ చలిని లెక్కచేయని ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్‌కు చెందిన జవాన్లు న్యూఇయర్ వేడుకలను గ్రాండ్‌గా జరుపుకున్నారు. కొన్ని జానపద పాటలకు స్టెప్పులు వేశారు జవాన్లు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజెన్లు కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ అనునిత్యం దేశ ప్రజల రక్షణ కోసం పనిచేసే జవాను త్యాగం ఎప్పటికీ మరువలేనిదంటూ పోస్టులు పెట్టారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications