Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ జూ ఘటన: పులిని చూసేందుకు పోటెత్తుతున్నారు

న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం ఢిల్లీ జూలో తెల్లపులి ఇరవై ఏళ్ల యువకుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ పులిని చూసేందుకు ఆ జూకు పెద్ద ఎత్తున వీక్షకులు తరలి వస్తున్నారట. విద్యార్థిని పులిని చంపిన సంఘటన మంగళవారం జరిగింది. ఆ తర్వాత రోజు నుండి చాలామంది ఆ తెల్లపులిని చూసేందుకు వస్తున్నారట.

విద్యార్థిని పులి చంపేసిందనే వార్త చూశాక చాలామంది వచ్చి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లక్నోకు ఓ వ్యక్తి బుధవారం పులిని చూసేందుకు వచ్చాడు. తాను లక్నోకు చెందిన వాడినని, మంగళవారం నాటి సంఘటన చూశాక తాను ఢిల్లీ జూను సందర్శించాలనుకున్నానని, ఇది తాను ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదని చెప్పాడు.

 Curious Visitors Flock Delhi Zoo to See White Tiger

సెంట్రల్ ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి కూడా ఇదే చెప్పారు. నేషనల్ జువాలాజికల్ పార్క్ వద్ద ఉండే ఓ సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. బుధవారం చాలా రద్దీగా ఉందని చెప్పాడు.

కాగా, నాలుగు రోజుల క్రితం ఇరవయ్యేళ్ల సెకండియర్ స్టూడెంట్‌ను తెల్లపులి చంపిన విషయం తెలిసిందే. అతను పులి ఉన్న ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. అప్పుడు ఆ పులి అతనిని నోటకరుచుకొని వెళ్లిపోయింది. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+