వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు: ఎన్నికల షెడ్యూల్ ఇదే

పలుమార్లు వాయిదా పడిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం తాజాగా ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Congress President Poll : Congress Announces Schedule | Oneindia Telugu

న్యూఢిల్లీ: పలుమార్లు వాయిదా పడిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం తాజాగా ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది.

సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. సాంకేతికంగా అధికార బదలాయింపు కోసం ఎన్నికలు జరపనుంది. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.

CWC meeting: Congress passes a resolution to make Rahul Gandhi new president

పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే రాహుల్‌ గాంధీ తప్ప ఇంకేవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

ఈ క్రమంలోనే డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2013లో రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపడుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
The Congress Working Committee on Monday passed a resolution to make way for Rahul Gandhi's appointment as party president, after a meeting at Congress chief Sonia Gandhi's 10 Janpath residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X