షీలా ప్రభుత్వం అవినీతిపై కేజ్రీ చర్యలు, మండిపడ్డ బిన్నీ

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రభుత్వం అవినీతి పైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కామన్వెల్త్ కుంభకోణం కేసును ఢిల్లీ ప్రభుత్వం అవినీతి నిరోధక విభాగానికి (ఎసిబి) అప్పగించింగి. షుంగ్లూ నివేదిక ఆధారంగా షీలా దీక్షిత్ ప్రభుత్వ అవినీతి పైన ఆమ్ ఆద్మీ (ఎఎపి) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పటికే కామన్వెల్తు కుంభకోణంకు సంబంధించిన ఫైలును ఎసిబికి పంపించారని, షీలా దీక్షిత్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కామన్వెల్తు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలలో విచారణ జరిపించి అవినీతిని బయట పెడతామని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పారు.

CWG scam: Kejriwal moves files, FIR likely against Sheila Dikshit

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఢిల్లీ సభలో ఎఎపి సర్కారు బలం 37కు తగ్గింది. సాధారణ మెజారిటీ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్నట్లయింది.

కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వినోద్ కుమార్ బిన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు లేఖ రాశారు. అవినీతిపరుడి కంటే కేజ్రీవాల్ ప్రమాదకారి అని, ఆయన అబద్దాలు చెబుతూ ఢిల్లీ ప్రజనే కాకుండా దేశాన్నే మోసం చేస్తున్నారని వినోద్ కుమార్ బిన్ని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+