వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో పెను తుఫాన్: తీరంపై విరుచుకుపడేలా: యంత్రాంగం అప్రమత్తం

|
Google Oneindia TeluguNews

పోర్ట్ బ్లెయిర్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌లా మారింది. పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై విరుచుకుపడనుంది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ ఉగ్రరూపాన్ని ధరిస్తోందీ తుఫాన్. దీని తీవ్రత నేపథ్యంలో- అండమాన్ నికోబార అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. కోస్ట్‌గార్డ్ బలగాలను రంగంలోకి దించింది.

Viral video: జనసేన జెండా కిందపడేసి..జూ.ఎన్టీఆర్ భారీ పతాకాన్ని ఎగరేసి: ఆ విషయంపై క్లారిటీViral video: జనసేన జెండా కిందపడేసి..జూ.ఎన్టీఆర్ భారీ పతాకాన్ని ఎగరేసి: ఆ విషయంపై క్లారిటీ

బంగాళాఖాతం ఆగ్నేయప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ఇప్పుడు తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీనికి అసానీ తుఫాన్ (Cyclone Asani)గా నామకరణం చేశారు. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతోంది. సోమవారం నాటికి అండమాన్ నికోబార్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అనంతరం బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు.

Cyclone Asani: Andaman and Nicobar Islands is making necessary arrangements, here is all

తుఫాన్ ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై తీవ్రంగా పడుతోంది. ఈ తెల్లవారు జాము నుంచి పోర్ట్ బ్లెయిర్ సహా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్ట్ బ్లెయిర్, ఫెర్రార్‌గంజ్, జిర్కాటంగ్, కార్ నికోబార్, లిటిల్ అండమాన్, హేవ్‌లాక్ ఐలండ్‌లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 48 గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అండమాన్ నికోబార్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తదుపరి ఉత్తర్వులు వెలువడించేంత వరకు సముద్రంపై చేపలవేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులను ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనులను చేపట్టారు. కోస్ట్‌గార్డ్ సిబ్బందిని సిద్ధం చేసింది.

English summary
s the year's first cyclone Asani, approaches the Andaman and Nicobar Islands, here is all you need to know about the preparations and advisories issued by the administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X