మంగళయాన్ పంపిన తొలి చిత్రంలో హెలెన్ తుఫాను
చెన్నై: ఇటీవల శ్రీహరికోట నుండి ప్రయోగించిన మామ్(మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్) తొలి ఫోటోగ్రాఫ్‌ను పంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. మామ్ పంపిన తాచా చిత్రంలో మన రాష్ట్రం తీరం దిశగా దూసుకొస్తున్న హెలెన్ తుఫాను కనిపించింది.

మామ్ ఈ చిత్రాన్ని మూడు రోజుల క్రితం అంటే మంగళవారం మధ్యాహ్నం తీసింది. మామ్ అంగారకుడిని చేరుకునే క్రమంలో ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. శాస్త్రవేత్తలు తనిఖీల్లో భాగంగా మార్స్ కెమెరాతో భూమి పైన ఫోటోలు తీశారు. ఈ ఫోటోను మామ్ నవంబర్ 19న దాదాపు 68,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు తీసింది. శాస్త్రవేత్తలు తీసిన ఫోటోల్లో ఒకదాంట్లో భారత్, ఆఫ్రికాలోని కొంత భాగం, హెలెన్ తుఫాను కనిపిస్తోంది.
కాగా, మామ్‌లో ఉన్న కలర్ కెమెరా బరువు 1.5 కిలోగ్రామ్స్ ఉంది. ఈ కెమెరా 20 మీటర్ల రిసొల్యూషన్‌తో ఫోటోలు తీస్తుంది. కెమెరాను పరీక్షించే భాగంలో శాస్త్రవేత్తలు ఈ ఫోటోను తీశారు. 1350 కిలోల శాటిలైట్‌ను నవంబర్ 5న శ్రీహరికోట నుండి లాంచ్ చేశారు.












Click it and Unblock the Notifications