వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాద్ తుపాను: ఉత్తరాంధ్రలో రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు.. పరిస్థితులను సమీక్షించిన ప్రధాని మోదీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

బంగాళా ఖాతంలో అల్ప పీడనం బలపడి తుపానుగా మారడంతో పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు.

''రానున్న మూడు రోజుల్లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సమాచారం అందించాం. సహాయక చర్యల ఏర్పాట్లను హోం శాఖ కార్యదర్శి వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 29 బృందాలను మోహరించాం. తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది’’అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.

https://twitter.com/ANI/status/1466330990037520389

మధ్య అండమాన్ సముద్రంలో డిసెంబరు 1న ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది.

cyclone

ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రానున్న 12 గంటల్లో వాయు గుండంగా మారుతుంది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారుతుంది.

ఈ తుపానుకు జవాద్‌గా నామకరణం చేశారు. ఇది నాలుగో తేదీ అంటే శనివారం ఒడిశా లేదా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీరందాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

100 కి.మీ. వేగంతో గాలులు..

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలోని తీర ప్రాంతాల్లో జవాద్ తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ కూడా వెల్లడించింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, శ్రీకాకుళంతోపాటు ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరివాహక ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

తుపాను సన్నద్ధతపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో నేషనల్ క్రైసిస్ మేనేజ్ కమిటీ (ఎన్‌సీఎంసీ) కూడా సమావేశమై, పరిస్థితులను సమీక్షించింది.

మరోవైపు ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌లకు ఐఎండీ రెడ్ అలర్టులు జారీచేసింది.

తుపాను ముప్పు నడుమ నేటి నుంచి మూడు రోజులవరకు మొత్తంగా 95 రైళ్లను కోస్తా రైల్వే విభాగం రద్దుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cyclone Jawad: Northern Andhra to witness Heavy rains, PM Modi reviews the situation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X