వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాన్నాళ్ల‌కు మోదీ-దీదీ ఫేస్ టు ఫేస్ -Cyclone Yaas నష్టంపై ప్రధాని సమీక్ష -నేడు ఒడిశా, బెంగాల్‌లో సర్వే

|
Google Oneindia TeluguNews

తీరం దాటిన మూడు రోజుల తర్వాత కూడా యాస్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒడిశాలో తీరం దాటిన యాస్ తుపాను ఆ రాష్ట్రంతోపాటు పక్కనున్న పశ్చిమ బెంగాల్ లోనూ విలయం సృష్టించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1కోటి మంది ప్రభావితులయ్యారు. యాస్ నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశా, బెంగాల్ లో పర్యటించనున్నారు.

మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనామోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనా

ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని ముందుగా భువ‌నేశ్వ‌ర్‌ చేరుకుని ఒడిశాలో తుఫాన్ ప‌రిస్థితిపై సీఎం నవీన్ పట్నాయక్, ఉన్నతాధికారులు స‌మీక్ష జరుపుతారు. తుపాను ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాసోర్‌, భ‌ద్ర‌క్‌, పర్బ మేదినిపూర్‌ల‌లో ప్రధాని ఏరియ‌ల్ స‌ర్వే చేస్తారు. ఆ తర్వాత..

Cyclone Yaas: PM Modi to visit Odisha, Bengal today to assess impact, to meet mamata, naveen

ఒడిశా నుంచి ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. మెదినీపూర్ జిల్లాలో గల కలైకుందా ఎయిర్ బేస్ నుంచే యాస్ తుపాను తీవ్రతపై సమీక్ష చేస్తారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. హోరాహోరీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ, దీదీ నేరుగా ఎదురుపడుతుండటం ఇదే తొలిసారి. మూడో సారి సీఎంగా ఎన్నికైన తర్వాత కూడా కేంద్రంపై మమత వరుస విమర్శలు చేస్తుండటం, తుపాను సాయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణలు చేస్తోన్న దరిమిలా వీరి కలయికపై రాజకీయంగానూ ప్రధాన్యం ఏర్పడింది.

Cyclone Yaas: PM Modi to visit Odisha, Bengal today to assess impact, to meet mamata, naveen

యాస్ తుపాను కారణంగా జార్ఖండ్ లో శుక్రవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో గురువారం రాత్రి భారీ ఎత్తున పిడుగులు పడ్డాయి. ముర్షిదాబాద్, నదియా జిల్లాల్లో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ఐదురుగు వ్యక్తులు మరణించారు. పూరబ్ మెదినిపూర్ లో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కోల్ కతా సహా పలు తీర జిల్లాల్లోని టూరిస్టు కేంద్రాలన్నీ ధ్వంసమయ్యాయి. ఒడిశాలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది.

రఘురామ కోసం కదిలిన మోదీ సర్కార్ -కరోనాలోనూ ఢిల్లీ ఎయిమ్స్‌లో స్పెషల్ చేరిక -కష్టంలో తోడున్నందుకురఘురామ కోసం కదిలిన మోదీ సర్కార్ -కరోనాలోనూ ఢిల్లీ ఎయిమ్స్‌లో స్పెషల్ చేరిక -కష్టంలో తోడున్నందుకు

ఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను దెబ్బకు గుజరాత్, మహారాష్ట్ర భారీగా దెబ్బతినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఒక్క గుజరాత్ కు మాత్రమే రూ.1000 కోట్లు సహాయం ప్రకటించడం, మహారాష్ట్రను ఏవిధంగానూ ఆదుకోకపోవడం వివాదాస్పదమైంది. ఇప్పుడు యాస్ తుపాను నష్టం అంచనాలపై సర్వే చేయనున్న ప్రధాని మోదీ ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఏమేరకు సహాయం ప్రకటిస్తారో ఇంకాసేపట్లో తేలనుంది..

Recommended Video

Cyclone Yaas Landfall Visuals ఉప్పొంగి విరుచుకుపడ్డ సముద్రం | Tsunami | Floods | Oneindia Telugu

English summary
Prime Minister Narendra Modi will visit Odisha and West Bengal on Friday to assess the damage caused by cyclonic storm Yaas in the two coastal states. He will first land in Bhubaneswar, where he will hold a review meeting before undertaking an aerial survey of Odisha's Balasore and Bhadrak and West Bengal's Purba Medinipur, officials said. He will then hold a review meeting in West Bengal. PM Modi to meet West Bengal CM Mamata Banerjee and odisha CM Naveen Patnaik today to review impact of Cyclone Yaas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X