సైరస్ మిస్త్రీకి మరో షాక్: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఔట్
సైరస్ మిస్త్రీకి మరో షాక్ తగిలింది. టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి ఆయనను తప్పించారు. దీంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి కూడా తప్పించినట్లయింది.
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అవమానకర రీతిలో వైదొలగిన సైరస్ మిస్త్రీకి మరో షాక్ తగిలింది. సోమవారం జరిగిన షేర్ హోల్డర్స్ సమావేశంలో ఆయనను టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. ఈ విషయాన్ని టాటా కంపెనీ తెలిపింది. దీంతో చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లయింది.
సోమవారం జరిగిన టాటా ఇండస్ట్రీస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం)లో మిస్త్రీని తొలగించాల్సిందిగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నుంచి మిస్త్రీని తొలగించాల్సిందిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్ హోల్డర్లను టాటా సన్స్ కోరింది.

బోర్డులో ఆయన కొనసాగితే అది టాటా గ్రూప్ ముక్కలు కావడానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వచ్చే కొన్ని వారాల్లో మిస్త్రీని తొలగించడానికి ఆరు టాటా గ్రూపు కంపెనీలు ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించనున్నాయి.
అక్టోబర్‌లోనే మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించినప్పటికీ తర్వాత కూడా గ్రూపులోని కొన్ని కంపెనీలకు బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మిస్త్రీ స్థానంలో రతన్ టాటా మరోసారి టాటా సన్స్ చైర్మన్ అయిన విషయం తెలిసిందే.
టాటా సన్స్ అనుబంధ సంస్థ అయిన టాటా ఇండస్ట్రీస్ బోర్డు సభ్యులుగా కెఆర్ఎస్ జమ్వాల్, ఐరీనా విఠల్, ఆశిష్ ధావన్ ఆర్ఆర్ భింగే, ఎన్. శ్రీనాథ్, ఎఫ్.ఎన్.. సుబేదార్ ఉన్నారు. టాటా కొత్తవ్యాపారాల్లోకి ప్రవేశించే కార్యకలాపాలను ఇది ప్రమోట్ చేస్తుంది. పెరుగుదలకు వెసులుబాటు కల్పి్సతూ ఆపరేటింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications