సైరస్ మిస్త్రీకి మరో షాక్: టీసీఎస్ ఛైర్మన్‌గా ఇషాత్
హైదరాబాద్: సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ మరో షాక్ ఇచ్చింది. టాటా గ్రూప్ యాజమాన్యం.. టాటా కన్సల్టెంట్ సర్వీసెస్(టీసీఎస్) తాత్కాలిక ఛైర్మన్‌గా ఇషాత్ హుస్సేన్ ఎంపిక చేసింది. ఈ మేరకు టాటా సన్స్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొద్దిరోజుల క్రితం సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ తాత్కాలిక ఛైర్మన్‌గా ఇషాత్ హుస్సేన్‌కు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications