బాలిక కిడ్నాప్, అత్యాచారం: ఇద్దరు కామాంధులు అరెస్టు
బెంగళూరు: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, బెళ్తంగడి పోలీసులు అరెస్టు చేశారు. బెళ్తంగడి తాలుకా కోయ్తూరులో నివాసం ఉంటున్న సచిన్, లయోల మ్యాథ్యూ అనే ఇద్దరిని అరెస్టు చేశామని మంగళవారం పోలీసులు చెప్పారు.
ఇద్దరిని న్యాయస్థానం ముందు హాజరు పరిచామని న్యాయమూర్తి వీరిని 15 రోజులు రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారని పోలీసులు తెలిపారు.
16 సంవత్సరాల బాలిక బెళ్తంగడిలో ఇంటర్ చదువుతోంది. ఈమె శనివారం సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో వీరిద్దరు కారులో అటువైపు వెళ్లారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని బాలికకు చెప్పారు. తాను రాననిచెప్పిన బాలికను కారులో కిడ్నాప్ చేశారు.

నిందితులు బాలికను బెళ్తంగడి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి ఇద్దరు బాలిక మీద అత్యాచారం చేశారు. అదే రోజు రాత్రి బాలికను పిలుచుకుని వచ్చి కోయ్తూరు గ్రామం శివార్లలో వదిలి పెట్టారు. విషయం బయటకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తామని బాలికను ఇద్దరు హెచ్చరించారు.
బాలిక ఇంటికి వెళ్లడంతో ఎందుకు ఆలస్యం అయ్యిందని కుటుంబ సభ్యులు నిలదీశారు. బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి వేరే గ్రామంలో తలదాచుకున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరిక్షలకు తరలించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications