రాయ్‌గఢ్ మేయర్‌గా దళిత హిజ్రా... చరిత్ర సృష్టించింది
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ‌్‌గఢ్ మేయర్ ఎన్నికల్లో ఓ హిజ్రా చరిత్ర సృష్టించింది. రాయ‌్‌గఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మధు కిన్నర్ అనే హిజ్రా, బీజేపీ అభ్యర్ధి మహవీర్ గురూజీపై 4,537ఓట్ల తేడాతో విజయం సాధించింది.
దళితవర్గానికి చెందిన మధు కిన్నర్ రాయ్‌గఢ్ మేయర్‌గా ఎన్నికైన తొలి హిజ్రా కావడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మధు కిన్నర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోడవం వల్లే ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. నా విజయం ప్రజల ఆశీస్సులు, ప్రేమతో నిండి ఉందని చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో మద్దతుగా నిలిచిన ప్రజలకు నా ధన్యవాదాలని అన్నారు. మధు కిన్నర్ గెలుపొందింది అని తెలియగానే అభిమానులు కౌంటింగ్ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని అభినందనలు తెలిపారు.
పేదల అభ్యున్నతకే నా తొలి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రద్దు చేయబడిన పేదవారి రేషన్ కార్డులు తిరిగి పునరుద్ధరిస్తానని తెలిపారు. నరేశ్‌చౌహాన్ అనే పేరును మధు కిన్నార్‌గా మార్చుకున్న ఆ హిజ్రా.. ఎనిమిదో తరగతి పూర్తిచేసిన తర్వాత రైళ్లలో నృత్యాలు చేస్తూ డబ్బు సంపాదించేవారు.

ఆ సంపాదనలో కేవలం రూ. 70 వేలు మాత్రమే ప్రచార సందర్భంగా తాను ఖర్చుచేశానని.. ప్రజల అభిమానమే తనను గెలిపించిందని ఈ సందర్భంగా మధు కిన్నర్ చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేది మాట్లాడుతూ ఈ ఓటమి అధికార బీజేపీకి గుణపాఠమని, రాయ్‌గఢ్‌లో ఈసారి ప్రధాని మోడీ హవా పనిచేయలేదని విమర్శించాడు.












Click it and Unblock the Notifications