దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం... సజీవదహనం..

ముజఫర్‌నగర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిపై కేసు నమోదుచేశారు. అయితే నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 సామూహిక అత్యాచారం, హత్య

సామూహిక అత్యాచారం, హత్య

ముజఫర్ నగర్‌లో ఇటుక బట్టీలో పనిచేసే దంపతులకు పక్కనే ఉన్న చిన్న రూంలో ఉండేవారు, వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. గతవారం తల్లి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరడంతో సదరు బాలిక తమ్ముడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇదే అదునుగా బాలికపై కన్నేసిన ఇటుక బట్టీ యజమాని మరో ఆరుగురితో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను సజీవ దహనం చేశాడు.

నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు

నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు

తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దగ్దమైన బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఇటుక బట్టి యజమానితో పాటు అతనితో కలిసి దారుణానికి ఒడిగట్టిన ఆరుగురిపై లైంగిక దాడి, హత్య, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాలిక హత్య కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
అయితే నిందితుల్లో ఎవరినీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

తమ కూతురు హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఇటుకబట్టి యజమాని మిగతా నిందితులతో కలిసి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడని అంటున్నారు. ఇంట్లో కొన్ని బట్టలను తగులబెట్టి అగ్ని ప్రమాదం జరిగినట్లు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హత్య జరిగిన రూంలో కరెంటుగానీ, మండే స్వభావమున్న పదార్థాలేవీ లేనప్పుడు ప్రమాదవశాత్తూ మంటలు ఎలా అంటుకున్నాయని ప్రశ్నించారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని బీమ్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+