• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత మహిళను 9 రోజులు బంధించి, మత్తుమందిచ్చి.. వీడియో తీస్తూ పోలీస్ తో సహా నలుగురు గ్యాంగ్

|
Google Oneindia TeluguNews

హర్యానా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు అపహరించి ఓ గదిలో నిర్బంధించి తొమ్మిదిరోజుల పాటు లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల దళిత మహిళను గురుగ్రామ్ పోలీసుతో సహా నలుగురు స్నేహితులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారని దుండగుల చెర నుండి తప్పించుకొని బయటపడిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది .

ఏపీలో దండుపాళ్యం గ్యాంగ్ దారుణాలు .. ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ,ఆధారాలు దొరక్కుండా ఆరు హత్యలుఏపీలో దండుపాళ్యం గ్యాంగ్ దారుణాలు .. ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు ,ఆధారాలు దొరక్కుండా ఆరు హత్యలు

 గురుగ్రాంలో దారుణం .. వివాహిత గ్యాంగ్ రేప్

గురుగ్రాంలో దారుణం .. వివాహిత గ్యాంగ్ రేప్

తనను బల్లభ్ ఘర్ లోని ఒక గదిలో ఉంచి మత్తుమందులు ఇచ్చి ,తన పై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె వెల్లడించింది. అంతేకాదు నిందితులు అత్యాచారం చేస్తున్న దృశ్యాలు వీడియోగ్రాఫ్ చేసి ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. దీనికి సంబంధించి సోహ్నా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అసలేం జరిగింది దానిపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

 మత్తుమందిచ్చి మహిళ అపహరణ .. గదిలో బంధించి అత్యాచారం

మత్తుమందిచ్చి మహిళ అపహరణ .. గదిలో బంధించి అత్యాచారం

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. సోహ్నా సమీపంలోని గ్రామంలో నివసిస్తున్న బాధితురాలు వివాహిత, ఆమె పిల్లల తల్లి కూడా. జూన్ 30 న స్నేహితుడైన చింటు ఆమెను ఒక ఆలయంలో కలిశారు. ఆ తర్వాత , అతని ఇద్దరు స్నేహితులు దీపక్ మరియు సంజులు ఒక తెల్ల కారులో అక్కడకు చేరుకున్నారు. వారు ఆమె ఇంటిని ఇంటి వద్ద వదిలి పెడతామని చెప్పి, మత్తు మందు కలిపిన పానీయం నిచ్చి ఫరీదాబాద్ వైపు ఆమెను తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారని తనకు స్పృహ వచ్చి చూసేసరికి తాను ఒక గదిలో ఉన్నానని ఆమె పేర్కొన్నారు.

అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్ కూడా

అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక పోలీస్ కూడా

ఆరోజు రాత్రి స్థానిక పోలీస్ అధికారి కుల్దీప్ కూడా వారితో కలిసి, మొత్తం నలుగురు తనను సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కుల్దీప్ కూడా తనకు ఏదో ఇంజెక్ట్ చేశారని, దాంతో తన శరీరం మొద్దుబారిపోయిందని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. వారు తొమ్మిది రోజులలో తనను అనేకమార్లు అత్యాచారం చేశారని పేర్కొంది. జూలై 8 న తనను భల్లబ్ ఘర్ వద్ద పడేసి వెళ్లిపోయారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.

నలుగురు నిందితులపై కేసు నమోదు .. పోలీస్ అరెస్ట్

నలుగురు నిందితులపై కేసు నమోదు .. పోలీస్ అరెస్ట్

బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు అత్యాచారం చేసినట్లు ధృవీకరించారు. చింటు, సంజు, దీపక్ మరియు కుల్దీప్ అనే నలుగురు నిందితులపై ఐపిసి, సెక్షన్ సెక్షన్ 365 (కిడ్నాప్), 328 , 201 మరియు 376-డి (సామూహిక అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టం యొక్క 25-54-59, ఎస్సీ / ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు కుల్దీప్‌ను సోహ్నా సమీపంలోని పోలీసు చౌకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

English summary
A 28-year-old Dalit woman was allegedly abducted and gang-raped by four friends, including a Gurugram policeman, after holding her hostage for nine days. The woman alleged that she was kept in a room in Ballabhgarh and injected with sedatives. The accused also videographed the crime and threatened her, said the victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X