వాచ్ చోరీ చేశాడని కొట్టి చంపేశారు
లక్నో: వాచ్ దొంగలించాడని ఓ దళితుడిని అతి దారుణంగా కొట్టి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లా సాతి గ్రామంలో జరిగింది. కొఠారి (42) అనే వ్యక్తి హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు. బందా జిల్లా పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వాచ్ చోరీ చేశాడని ఆరోపిస్తూ సాతి గ్రామానికి చెంది చున్ మున్ పటేట్ అనే వ్యక్తి కొఠారిని పట్టుకుని పెద్ద కర్ర తీసుకుని దాడి చేశాడు. కొఠారిని విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దాడిలో కొఠారికి తీవ్రగాయాలైనాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొఠారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు.పోలీసు అధికారులు చున్ మున్ పటేల్ మీద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైనాడని అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి యశ్వీర్ సింగ్ తెలిపారు.
దళితుడిని అగ్రవర్ణ కులానికి చెందిన చున్ మున్ పటేట్ హత్య చెయ్యడంతో సాతి గ్రామంలో గొడవలు మొదలైనాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు అధికారులు అదనపు బలగాలను తరలించి గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల పెద్దలతో పోలీసు అధికారులు శాంతి చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications