వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నృత్య గణేశ, 900 ఏళ్ల నటరాజ విగ్రహంతో పాటు 157 పురాతన విగ్రహాలు; మోడీకి యూఎస్ రిటర్న్ గిఫ్ట్

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా ముగిసింది. అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా కొన్ని కానుకలను అందజేసింది. భారతదేశానికి చెందిన అపురూపమైన ఆ కానుకలను ప్రధాని మోడీ భారత్ కు తీసుకొచ్చారు. వాటిని మోడీ ఆసక్తికరంగా తిలకించారు.

మోడీకి యూఎస్ కానుకలు .. 157 పురాతన కళాకృతులు ఇచ్చిన యూఎస్
యూఎస్ పర్యటనలో క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన బహుమానాలను అందించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీకి అమెరికా భారతదేశానికి చెందిన అత్యంత పురాతన 157 కళాకృతులను బహుమతిగా అందజేసింది. భారతదేశం నుండి అక్రమంగా రవాణా చేయబడిన వస్తువుల జాబితాలో క్రీస్తుపూర్వం 2000 నాటి రాగి వస్తువులతో పాటు పలు యాంటిక్ వస్తువులు, మరియు 2 వ CE (కామన్ ఎరా) టెర్రకోట వస్తువులు ఉన్నాయి. దాదాపు 45 పురాతన వస్తువులు సాధారణ యుగానికి ముందు (BCE) చెందినవని ప్రభుత్వం తెలిపింది.

Dancing Ganesha, 900-yr-old Natraj along with 157 smuggled Indian antiques; US return gifts to PM Modi

భారత్ కు చెందిన తొమ్మిది వందల ఏళ్ల క్రితం నాటి నటరాజ విగ్రహం, పురాతన నృత్య గణపతి విగ్రహం
భారతదేశానికి తిరిగి ఇచ్చిన వస్తువులలో తొమ్మిది వందల ఏళ్ల క్రితం నాటి నటరాజ విగ్రహం, పురాతన నృత్య గణపతి విగ్రహం ఉన్నట్లుగా పేర్కొన్నారు. హిందూ మతానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు, జైన బౌద్ధ మతాలకు చెందిన విగ్రహాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మూడు తలల బ్రహ్మ, రధాన్ని నడిపిస్తున్న సూర్యుడు, దక్షిణామూర్తిగా శివుడి విగ్రహం, విష్ణువు లక్ష్మీ దేవి విగ్రహం బౌద్ధ మతానికి చెందిన బుద్ధుడి విగ్రహం జైన తీర్థంకరులు, పద్మాసన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య దొంగతనం, అక్రమ వ్యాపారం, సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక వీటిని ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి విడుదల చేసిన ప్రకటనలో ఇదే విషయాన్ని తెలియజేశారు.

ప్రకటన విడుదల చేసిన అరిందమ్ బాగ్చి ఏమన్నారంటే
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి విడుదల చేసిన ప్రకటనలో భారతదేశ అపురూప పురాతన సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటుందని, యూఎస్ భారతదేశ పురాతన సంపదను ప్రధాని నరేంద్ర మోడీ కి తిరిగి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు రెండు దేశాల నాయకులు ఇరు దేశాల మధ్య అక్రమ వ్యాపారాన్ని, సాంస్కృతిక సంపద దోపిడీని అరికట్టడానికి కృషి చేస్తాయని వెల్లడించారు.ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా పురాతన వస్తువులు మరియు కళాఖండాలను తిరిగి తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను కలిగి ఉంది" అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

మూడు రోజుల మోడీ పర్యటన సక్సెస్
మూడు రోజులపాటు అమెరికా లో సాగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన లో ప్రధాని మోడీ యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హరీష్ ఆస్ట్రేలియా ప్రధాని, జపాన్ ప్రధాని, టాక్సీ ఇవాళ తో భేటీ అయ్యారు. క్వాడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ 65 గంటల్లో 24 మీటింగ్ లలో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితిలో బలంగా భారతదేశ వాణిని వినిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది జనవరిలో అమెరికా 46 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బిడెన్‌తో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు సక్సెస్ ఫుల్ గా జరిగాయి.

English summary
The US has gifted 157 of India's oldest antiques to Prime Minister Modi. The list of items smuggled out of India includes Dancing Ganesha, 900-yr-old Natraj among 157 smuggled antiques.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X