విదేశీ మహిళపై 3 గంటలు రేప్: ఇద్దరు అరెస్టు

 Danish woman gang-raped for 3 hours in heart of Delhi, two held
న్యూఢిల్లీ: డెన్మార్క్ మహిళపై ఎనిమిది మంది వ్యక్తులు మూడు గంటల పాటు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారంనాడు ఈ దారుణం జరిగింది. 13 నెలల క్రితం నిర్భయ సామూహిక అత్యాచారం దుర్ఘటన కన్నా ఇది దారుణంగా జరిగింది. 51 ఏళ్ల డెన్మార్క్ మహిళపై వరుసగా ఎనిమిది అత్యాచారం చేస్తూ పోయారు.

భారత పర్యటనను ముగించుకోవడానికి సిద్ధపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తాను బస చేసిన పహర్‌గంజ్ హోటల్‌కు తిరిగి వస్తూ దారి తప్పింది. ఆమె న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని స్టేట్ ఎంట్రీ రోడ్డులో గల రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌కు చేరుకుంది. అక్కడ ఆమెను చిన్న పాటి తోటలోకి ఆమె తోసుకెళ్లారు. కత్తితో బెదిరించి దుండగులు ఆమెను దోపిడీ చేశారు.

దోపిడీ చేసి వదలకుండా ఆమెపై అత్యాచారం చేశారు ఎనిమిది మందిలో ఇద్దరు రెండేసి సార్లు తనను రేప్ చేశారని బాధితురాలు చెప్పింది. ఎట్టకేలకు ఆమె సాయంత్రం ఏడున్నర గంటలకు హోటల్‌కు చేరుకోగలిగింది. జరిగిన సంఘటనను హోటల్ మేనేజర్‌కు చెప్పింది.

డెన్మార్క్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు బుధవారం ఉదయం ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫతేపూర్‌కు చెందిన మహేందర్ గంజాకు పోలీసులు గుర్తించారు. అతను గతంలో రెండు హత్య కేసుల్లో నిందితుడని తెలుస్తోంది.

మరో నిందితుడిని రాజాగా గుర్తించారు. అతని నుంచి బాధితురాలికి చెందిన వేయి రూపాయల నగదును, కళ్లద్దాల కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+