వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెండ్‌ని కలిసి వెళ్తున్న యువతి కిడ్నాప్, గ్యాంగ్‌రేప్

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: స్నేహితుడిని కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కవర్ధా ప్రాంతంలో చోటు చేసుకుంది.

స్నేహితుడిని కలిసి ఇంటికి వెళ్లేందుకు ఆ యువతి సమీపంలోని బస్ స్టాప్ వద్దకు వచ్చింది. అక్కడ నిల్చున్న ఆమెను నలుగురు వ్యక్తులు బలవంతంగా ఓ పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒకరి తర్వాత ఒకరు పలుమార్లు ఆమెపై ఈ దారుణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కాగా, ఉదయం ఆమె అక్కడ్నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Dating plan goes sour, girl gangraped by four on her way back home

బిడ్డకు జన్మనిచ్చిన బుర్ద్వాన్ పేలుళ్ల నిందితురాలు

కలకత్తా: ఆలీపూర్ జైళ్లో ఉంటోన్న బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు అలీమా బీబీ బిడ్డకు జన్మనిచ్చారు. ఈమేరకు గురువారం జైలు అధికారులు తెలిపారు. కొద్ది నెలల క్రితం ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపారు.

మహిళా ఖైదీలు ప్రసవించడానికి జైళ్లో సౌకర్యం లేకపోవడంతో ఆమెను వేరే ఆస్పత్రిలో చేర్పించామని అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచామన్నారు.

నిరుడు అక్టోబర్ 2న బుర్ద్వాన్ లో జరిగిన పేలుళ్ల కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో అలీమా, రజ్జిరా బీబీ అనే మహిళతోపాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, బుర్ద్వాన్‌లో పేలుడు పధార్థాలు తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించి జమాతే ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కు చెందిన షకీల్ అహ్మద్, సోవాన్ మండల్ అనే ఉగ్రవాదులు మృతిచెందిన విషయం తెలిసిందే.

English summary
A minor was raped by four men in Kawardha on Wednesday on her way home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X