వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయంపై కేసు: ఐపీఎస్ అధికారిపై రేప్ కేస్, సస్పెండ్..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ బెదిరిస్తున్నారని కేసు పెట్టిన ఐపీఎస్ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌‌ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమ్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

ఆయన మీద క్రమశిక్షణారాహిత్యం, ప్రభుత్వ వ్యతిరేకత, హైకోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర ఆరోపణలు రావడంతో సోమవారం రాత్రి ఆయనను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వానికి తెలియకుండా లఖ్‌నవూ వదిలి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు.

ఇక రెండు రోజుల క్రితం ములాయం సింగ యాదవ్ తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటూ అమితాబ్‌ ఠాకూర్‌ ఓ వీడియో క్లిప్‌ విడుదల చేసిన ఆయనపై కేసు కూడా పెట్టారు. ములాయంపై కేసు పెట్టిన కొన్ని గంటల్లోనే అమితాబ్‌పై ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ అదే పోలీస్ స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది.

Day after filing complaint against Mulayam Singh, rape case lodged against IPS officer Amitabh Thakur

అయితే ఈ రేప్‌ను అమితాబ్‌ కొట్టిపారేశారు. ములాయంపై తాను కేసు పెట్టినందుకు ఆయన తనకు ఇచ్చిన బహుమతిగా ఆ కేసును ఠాకూర్‌ అభివర్ణించారు. హోం శాఖ అధికారులను కలిసి ఈ ఘటనలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.

దీంతో అమితాబ్‌ను హోంశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే అమితాబ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకు స్పందించక పోవడం విశేషం. అసలు అమితాబ్‌కు ములాయం వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఆయనే భార్య, ఆర్‌టీఐ ఉద్యమకర్త నూతన్ ఠాకూరే కారణమని తెలుస్తోంది.

నూతన్ ఠాకూర్ ఉద్యమకర్తగా ఉత్తరప్రదేశ్‌లోని సామాజిక విషయాలపై ఆమె తన గొంతుకను వినిపిస్తున్నారు. ఈ నేఫథ్యంలో మైనింగ్ శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతి అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో చాలా సార్లు విమర్శలు చేశారు.

నూతన్ ఠాకూర్ చేసిన ఆరోపణలకు గాను మైనింగ్ మంత్రిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. తన భార్య చేసిన ఆరోపణలకు ఉపసంహరించుకోవాలంటూ ములాయం ఐపీఎస్ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌‌కి వార్నింగ్ ఇచ్చి ఉంటారని స్ధానిక మీడియా కథనంలో పేర్కొంది.

English summary
An FIR has been registered against IPS officer Amitabh Thakur under rape charges in Gomti Nagar police station of Lucknow (UP) on Sunday a day after he filed a complaint with the police against Mulayam Singh Yadav, alleging that the Samajwadi Party chief threatened him with dire consequences if he does not mend his ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X