పార్టీ టిక్కెట్టు దక్కింది, ఆనందంలో హర్ట్ ఎటాక్ తో చనిపోయాడు

పార్టీ తనకు టిక్కెట్టు ఇచ్చిందనే సంతోషంలో ఆయన సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడు.అయితే మరునాడు ఉదయమే చాతీ నొప్పి వస్తోందని చెబితే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

ఉత్తర్ ప్రదేశ్ :ఎక్కువగా సంతోషపడినా, ఎక్కువగా విషాదకరమైన వార్తలు విన్నా కాని, కొందరు తట్టుకోలేరు.ఇదే తరహలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆకస్మికంగా మరణించాడు. సమాజ్ వాదీ పార్టీ అబ్యర్థి చండ్రసేన్ తప్లు సంతోషాన్ని తట్టుకోలేక మరణించాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా అసెంబ్లీ స్థానానికి చండ్రసేప్ తప్లు అనే వ్యక్తికి సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టును ఖరారు చేసింది. రెండు రోజుల క్రితం సమాజ్ వాదీ పార్టీ చీప్ ములాయం సింగ్ యాదవ్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చండ్రసేన్ పేరుంది.

 day after his name made it to mulayam singh yadav’s list, sp’s agra cantt candidate dies

దీంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.దీంతో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఆయన పార్టీ చేసుకొన్నాడు.తనకు పార్టీ టిక్కెట్టు ఇచ్చినందుకు ములాయంకు ధన్యవాదాలు తెలిపారు .

అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. గురువారం ఉదయం పూట 8 గంటలకు తనకు ఛాతీ నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు తెలిపారు.అయితే కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేసి గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారని వైద్యులు సలహఇచ్చారు.

గురుగ్రామ్ కు ఆయనను తరలిస్తుండగా మార్గమధ్యంలోని టోల్ ప్లాజా వద్ద ఆయన మరణించాడు. ఆగ్రా అభ్యర్థి మరణించడంతో సమాజ్ వాదీ పార్టీ నాయకులు విషాదంలో మునిగిపోయారు. చండ్రసేన్ మరణం పట్ల ఆ పార్టీ చీప్ ములాయం సింగ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+