మారన్‌కు ఊరట: ఇప్పుడే అరెస్ట్ చేయొద్దన్న సుప్రీం
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మూడు రోజుల్లోగా సీబీఐ అధికారుల ముందు ఆయన లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ మారన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేబుళ్ల కేసులో మారన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications