వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డియర్ పోటస్: మా ఆందోళనను ప్రధాని మోడీకి తెలియజేయండి: జో బైడెన్‌కు రాకేష్ టికాయత్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) రాకేష్ టికాయత్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం జరిగే సమావేశంలో వీటిపై ప్రస్తావించాలని కోరారు.

అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం భేటీ కానున్న నేపథ్యంలో కొన్ని గంటల ముందు టికాయత్ ఈ మేరకు ట్వీట్ చేశారు. డియర్ పోటస్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతులం ఆందోళన చేస్తున్నాం. గడిచిన 11 నెలలుగా జరుగుతోన్న ఈ నిరసన కార్యక్రమాల్లో ఇప్పటి వరకు దాదాపు 700 మందికి రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మమ్మల్ని రక్షించడానికి ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం సందర్భంగా మా ఆందోళనను పరిగణలోకి తీసుకోండి అంటూ రాకష్ టికాయత్ ట్విట్టర్ వేదికగా కోరారు. మూడు రోజులప పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు చేరుకున్నారు. కరోనావైరస్, ఆప్ఘాన్ లో తాలిబన్ల పాలన, ఇతర అంశాలపై దేశాధినేతలతో చర్చించనున్నారు.

కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ నుంిచ ఈ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ చట్టాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

 Dear POTUS, please focus on our concern while meeting PM Modi: Rakesh Tikaits tweet

సాగు చట్టాలపై రైతులకు ఉన్న అభ్యంతరాలను, ఇతర వర్గాల అభిప్రాయాలపై సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికపై త్రిసభ్య కమిటీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందజేసింది. అయితే, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా రైతు నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని చెప్పింది. అయితే, రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తోంది.

English summary
Dear POTUS, please focus on our concern while meeting PM Modi: Rakesh Tikait's tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X