బికనేర్-గువాహతి రైలుప్రమాదం-8కి చేరిన మృతులు- 5 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం
పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గురిలో నిన్న బికనేర్-గువాహతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో మృతులసంఖ్య 8కి చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 42 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదంపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా సహాయకచర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీకి వీటి వివరాలు కూడా అందిస్తున్నారు.
బికనేర్-గువాహతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో మృతులకుటుంబాలకు కేంద్రం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పిన పరిహారం ప్రకటించింది. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.25 వేలు చొప్పున ఇస్తున్నారు. గాయపడిన వారిలో 28 మందిని జల్పాయిగురి జిల్లా ఆసుపత్రిలో, 7 మందిని మొయినగురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుగురు కీలక ప్రయాణికులను సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదార బసు తెలిపారు.

రైలు ప్రమాద ఘటనాస్ధలి నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో మరణించారని అధికారులు పేర్కొన్నారు. "వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరగవచ్చని చెప్తున్నారు. చీకటి, దట్టమైన పొగమంచు మధ్య రాత్రి వరకూ గాలింపు, సహాయక చర్యలు కొనసాగాయి.
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.
రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి బయలుదేరిన రైలు బీహార్‌లోని పాట్నా మీదుగా అస్సాంలోని గౌహతికి వెళ్తుండగా నిన్న సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జల్‌పైగురిలోని మేనాగురి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన సమయంలో రైలులో బికనీర్ నుండి బయలుదేరిన 177 మంది, పాట్నా జంక్షన్‌లో ఎక్కిన 98 మంది ప్రయాణికులతో సహా 1,053 మంది ప్రయాణికులు ఉన్నారు.












Click it and Unblock the Notifications