వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CJI NV Ramana: టీవీ డిబేట్లతో ఇంకా కాలుష్యం: దినపత్రికలకు ఎవరి అజెండా వారికి ఉంది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం విషపూరితంగా తయారైంది. కాలుష్యం తీవ్రత రోజురోజుకూ అధికమౌతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగుతోంది. వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చడాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ను విధించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సైతం ఆదేశాలను జారీ చేశారు.

 పిటీషన్‌పై విచారణ..

పిటీషన్‌పై విచారణ..

ఢిల్లీలో నానాటికీ తీవ్రతరమౌతూ వస్తోన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకోవాలని కోరుతూ 17 సంవత్సరాల విద్యార్థి దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. దీనిపై విచారణను కొనసాగిస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల వాదనలను వింటోంది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపిస్తోన్నారు.

సీజేఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు..

సీజేఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు..

ఈ పిటీషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఘాటుగా స్పందించారు. టీవీ డిబేట్లల్లో ఏర్పాటయ్యే చర్చలు.. మరింత కాలుష్యానకి కారణమౌతున్నాయని అన్నారు. అందులో పాల్గొనే వారికి అంశాలపై ఎలాంటి అవగాహన ఉండట్లేదని చెప్పారు. రోజువారీ కంటే.. టీవీల్లో చోటు చేసుకుంటోన్న డిబేట్లు మరింత కాలుష్యానికి కారణమౌతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరి అజెండా వారికి ఉందని సీజేఐ అన్నారు.

డెయిలీ పేపర్లు చూశారా?

డెయిలీ పేపర్లు చూశారా?

తన వాదనలను వినిపిస్తోన్న అభిషేక్ మను సింఘ్వీని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ రమణ మాట్లాడుతూ- దినపత్రికలను చదువుతారా? అని ప్రశ్నించారు. ఈ రోజు దినపత్రికల్లో ఎవరికి తోచిన విధంగా వారు ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించిన స్టాటిస్టిక్స్‌ను ప్రచురించాయని అన్నారు. వాయు కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా దీపావళి నాడు బాణాసంచాను కాల్చడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించిందని మను సింఘ్వీ చెప్పగా.. ఆయన విభేదించారు.

బాణాసంచా కాలుష్యం తాత్కాలికమే..

బాణాసంచా కాలుష్యం తాత్కాలికమే..

బాణాసంచాను కాల్చడం వల్ల కాలుష్యం రాదంటూ కొన్ని నివేదికలు స్పష్టం చేస్తోన్నాయని అన్నారు. బాణసంచాల వల్ల ఏర్పడే కాలుష్యం తాత్కాలికమేనని గుర్తు చేశారు. నిషేధించిన తరువాత కూడా బాణాసంచాను కాల్చట్లేదా? అని ప్రశ్నించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ కలగజేసుకున్నారు. ఇంకా కాలుస్తూనే ఉన్నారంటూ సీజేఐకి బదులిచ్చారు. దీని గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది కదా అని చెప్పారు.

రైతులపై జరిమానాలను విధించాలనుకోవట్లేదు..

రైతులపై జరిమానాలను విధించాలనుకోవట్లేదు..


ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఎండుగడ్డిని దగ్ధం చేస్తోన్నారని, దాని ప్రభావం ఢిల్లీలో వాయు కాలుష్యంపై పడుతోందని అభిషేక్ మను సింఘ్వీ మరోసారి బెంచ్‌కు వివరించారు. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ- తాము రైతులపై జరిమానాలను విధించాలనుకోవట్లేదని, ఆ చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోవట్లేదని అన్నారు. రైతుల నుంచి ఎండుగడ్డిని కొనుగోలు చేసి, పరిశ్రమలకు సరఫరా చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పారు.

కాలుష్యాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలంటూ..

కాలుష్యాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలంటూ..

తమ ఉద్దేశం వాయు కాలుష్యాన్ని నియంత్రించడమేనని, దానికి సంబంధించిన అంశాలను కాకుండా ఇతర అజెండాలను పదే పదే ఎందుకు లేవదీస్తున్నారని సీజేఐ ప్రశ్నించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 90 శాతం మేర చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటిదాకా కేజ్రీవాల్ సర్కార్ చేపట్టిన చర్యల గురించి వివరించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నామని అన్నారు.

English summary
Debates on TV are creating more pollution than everybody. They don’t understand, statements are taken out of context, says Supreme Court during the hearing on Delhi Air pollution plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X