బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతరిక్షాన్ని అందుకున్నాం.. ఇక సముద్ర గర్భాన్ని శోధిద్దాం.. ప్రధాని పిలుపు

|
Google Oneindia TeluguNews

అంతరిక్ష ప్రయోగాల్లో మేటిగా నలిచిన ఇస్రో రాబోయే రోజుల్లో చంద్రయాన్ 3, గగన్ యాన్ లాంటి ప్రాజెక్టుల్నీ విజయవంతంగా నిర్వహించగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్పేస్ రీసెర్చ్ లో భారత సైంటిస్టులు ఎంతో పురోగతి సాధించారని, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ను సమర్థవంతంగా వినియోగించుకోడానికి చర్చలు తీసుకుంటున్నామన్నారు. రెండు రోజుల పర్యటన కోసం కర్నాటక వచ్చిన ఆయన బుధవారం బెంగళూరులో 107వ ఇండియణ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఫోకస్ చెయ్యాల్సిన అంశాలపై నిర్దేశం చేశారు.

Recommended Video

Congress doesn’t speak Against Pakistan : PM Modi
ఈ ఏడాది ఇలా మొదలైనందుకు హ్యాపీ..

ఈ ఏడాది ఇలా మొదలైనందుకు హ్యాపీ..

ఈ దతాబ్దిలోని మొదటి సంవత్సరం తొలి వారంలోనే సైన్స్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, అది కూడా ఇన్నోవేషన్లు, సైన్స్ కు కేంద్రంగా ఉందన్న బెంగళూరు నగరంలో గడపడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. పాజిటివ్ ఆలోచనలతో 2020లోకి అడుగుపెట్టిన మనం.. సైన్స్ అండ్ టెక్నాలజీని మరింతగా డెవలప్మెంట్ చేసుకుందామని, ఆ తర్వాత మిగిలిన అంశాలపైనా ఫోకస్ పెంచుదామని అన్నారు.

50 ఏండ్లలో జరగనిది 5 ఏండ్లలోనే..

50 ఏండ్లలో జరగనిది 5 ఏండ్లలోనే..

ప్రస్తుతం ప్రపంచంలో ఆవిష్కరణలకు కేంద్రంగా మన దేశంఎదిగిందని, ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 52కు మెరుగుపడిందని ప్రధాని చెప్పారు. గత 50 ఏండ్లతో పోల్చుకుంటే చివరి ఐదేండ్లు.. టెక్నాలజీ సంబంధిత వ్యాపారాలు, అంకుర సంస్థలు బాగా అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. ఇందుకుగానూ సైంటిస్టులకు అభినందనలు తెలిపారు.

తర్వాతి టార్గెట్ సముద్రమే..

తర్వాతి టార్గెట్ సముద్రమే..

అంతరిక్ష పరిశోధనల్లో గొప్ప విజయాలు సాధించిన మనం.. ఇప్పుడు సముద్రపులోతులపై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. నీటి అడుగున ఉన్న విస్తారమైన ఖనిజ సంపదను, శక్తిని అణ్వేషించి, వాటిని వెలికితీసి మనవాళి మంచి కోసం ఉపయోగించుకుందామని పిలుపునిచ్చారు. వనరుల వాడకంలో బాధ్యతాయుతంగా ఉండాలని హితవు పలికారు.

మూలాల నుంచీ ఎదగాలి..

మూలాల నుంచీ ఎదగాలి..

ఇండియా అభివృద్ధి.. గ్రామాల అభివృద్ధితోనే ముడిపడి ఉందనిన్న మోదీ.. మూలాల నుంచే ఎదగాలని సూచించారు. గడిచిన ఐదేండ్లలో గ్రామీణాభివృద్ధి కోసం చాలా పాడుపడ్డామని, టెక్నాలజీ సాయంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా మార్కెట్ ప్రయోజనాల్ని అందిస్తున్నామని చెప్పారు. .

English summary
speaking at the inauguration of the 107th Indian Science Congress in Bengaluru, PM Modi says Our successes in space exploration should now be mirrored in the new frontier of the deep sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X