రైతు నేతలకు దీప్‌ సిద్ధూ వార్నింగ్‌- ఎర్రకోట ఘటనలపై బురదజల్లితే గుట్టు బయటపెడతానంటూ

రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీ జరిగన ట్రాక్టర్ల ర్యాలీని ఎర్రకోట ముట్టడిగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ రైతు సంఘాల నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. రిపబ్లిక్‌ డే రోజు ఘటనలతో పాటు రైతు సంఘాల పాత్రపై ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఎర్రకోట ఘటనకు రైతులను ప్రేరేపించారంటూ రైతు సంఘాల నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను దీప్‌ సిద్ధూ ఖండించారు. రైతు సంఘాల నేతల ఆరోపణలపై స్పందిస్తూ వారి గురించి తాను రహస్యాలు బయటపెట్టడం మొదలుపెడితే ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. మీరు సిగ్గులేకుండా నన్ను తప్పుబడుతున్నారు. మీరు చెప్పడం వల్లే రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి వచ్చారు. మీరు చెప్పినట్లే వారు చేశారు. అయినా లక్షలాది మంది నా మాట ఎందుకు వింటారని సిద్ధూ ప్రశ్నించారు.

Deep Sidhu threatens to reveal secrets of farmer unions leaders

లక్షలాది మందిని నేను రెచ్చగొట్టానని చెప్తున్న మీరు, అప్పుడు ఎక్కడున్నారు, ఎందుకు అడ్డుకోలేకపోయారని రైతు సంఘాల నాయకులను దీప్‌ సిద్ధూ సూటిగా ప్రశ్నించారు. ఎర్రకోట ఘటన జరిగిన సమయంలో తాను సింఘూ సరిహద్దుల్లోనే ఉన్నానని సిద్ధూ వెల్లడించారు. రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచిన తాను ఇప్పుడు కూడా వారి ప్రయోజనాల కోసమే ఇంతకు మించి మాట్లాడటం లేదని తెలిపారు. ఎర్రకోట ఘటనలో రైతులకు మద్దతివ్వాల్సింది పోయి విమర్శించడం తగదని దీప్‌ సిద్ధూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+