జయను చంపేందుకు శశికళతో కలిసి నా సోదరుడు కుట్ర: దీప సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తన సోదరుడు దీపక్ పైన ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితను చంపేందుకు తన సోదరుడు దీపక్.. శశికళతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా దీప.. దీపక్‌తో పాటు శశికళను టార్గెట్ చేశారు.

దీపక్‌ను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లేందుకు దీప, ఆమె మద్దతుదారులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, దీప మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది.

దీప సంచలన ఆరోపణలు

దీప సంచలన ఆరోపణలు

ఈ సందర్భంగా దీప మాట్లాడారు. పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు. శశికళ కుటుంబం నుంచి అన్నాడీఎంకేను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు.

దీపక్ దాడి చేశాడు

దీపక్ దాడి చేశాడు

పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తే శశికళ కుటుంబసభ్యులతో కలిసి తనపై దాడి చేశాడని దీప ఆరోపించారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.

జయ ఆస్తుల స్వాధీనం కోసం..

జయ ఆస్తుల స్వాధీనం కోసం..

శశికళ కుటుంబం చేతుల్లో నుంచి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని పిలుపునిచ్చారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప డిమాండ్ చేశారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. జయలలిత ఆస్తికి తానే వారసురాలినని, పోయెస్ గార్డెన్స్ తనకే దక్కుతుందన్నారు.

ఆరోపణలను ఖండించిన దీపక్

ఆరోపణలను ఖండించిన దీపక్

దీపా జయకుమార్ ఆరోపణలను దీపక్ ఖండించారు. జయ ఆస్తులకు తామిద్దరం వారసులమని, కానీ దీపా మాత్రం రాద్దాంతం చేస్తోందన్నారు. మా అత్త జయను చంపేందుకు తాను కుట్ర చేశానని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ విషయంపై తాను త్వరలో ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. తాను ఎలాంటి కుట్రలు చేయలేదన్నారు. తాను దీపతో సహా ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అలాంటప్పుడు శశికళతో కలిసి తాను కుట్ర చేశానని చెప్పడం సరికాదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa Jayakumar accused brother Deepak of conspiring with Sasikala to 'kill' their aunt and former Tamil Nadu Chief Minister J Jayalalithaa. Deepak refuted the claim.
Please Wait while comments are loading...