వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: ఆర్మీకి అదనపు పవర్స్ -వైరస్ కట్టడికి ప్రత్యేక ఆర్థిక అధికారాలు -రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి నేపథ్యంలో భారత సైన్యానికి సంబంధించి రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, నియంత్రణలో తమ వంతుగా అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్న సైన్యానికి మరికొన్ని అధికారాలు కల్పించారు. రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటనలు చేశారు..

షాకింగ్: కొవిడ్ ఓ భారీ కుంభకోణం -ఈ తీరు వల్లే కొంప మునిగిందన్న కేంద్రం -మనం అలిసినా వైరస్ ఆగదుషాకింగ్: కొవిడ్ ఓ భారీ కుంభకోణం -ఈ తీరు వల్లే కొంప మునిగిందన్న కేంద్రం -మనం అలిసినా వైరస్ ఆగదు

సాయుధ బలగాలకు అదనపు అధికారాలు కల్పిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలిచ్చింది. కొత్తగా లభించిన అధికారాలతో కరోనా చికిత్సా కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు నెలకొల్పడం, కావాల్సిన వనరుల్ని సమకూర్చుకోవడం సహా ఇతర అత్యవసర చర్యలు ఎలాంటి అనుమతులు లేకుండా స్వతహాగా చేపట్టేందుకు సైన్యానికి అవకాశం లభిస్తుంది.

Defence Minister Rajnath invokes emergency powers enabling Armed Forces to set up Covid facilities

సాయుధ బలగాలకు లభించిన తాజా అధికారాలతో ఇకపై కార్ప్స్‌/ఏరియా కమాండర్లు రూ.50 లక్షలు, డివిజన్‌/సబ్‌ ఏరియా కమాండర్లు రూ.20 లక్షల వరకు కరోనా కట్టడి చర్యలు, ఇతర సహాయక చర్యల నిమిత్తం వినియోగించేందుకు అధికారం ఉంటుంది. ఈ అధికారాలు మే 1 నుంచి జులై 31 వరకు, అంటే మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి.

 కరోనా: దేశంలో తొలిసారి తెలంగాణలో -డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ -టోసిలిజుమాబ్‌ వాడకంపై కమిటీ కరోనా: దేశంలో తొలిసారి తెలంగాణలో -డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ -టోసిలిజుమాబ్‌ వాడకంపై కమిటీ

Recommended Video

Uttam Kumar Reddy's Video From Hospital.. COVID బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం

గతంలో సైనిక వర్గాల్లోని వైద్యాధికారులకు కల్పించిన అత్యవసర అధికారాలను మరింత మందికి పొడిగిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ తొలి దశ విజృంభణ సమయంలోనూ కేంద్రం ఈ తరహా అధికారాలను కల్పించింది. దేశంలో కరోనా సెకెండ్ వేవ్‌ నేపథ్యంలో అత్యవసర ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు పెద్ద సైజు ఆక్సిజన్ సిలెండర్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఏ) వివిధ ఆసుపత్రులకు అందజేస్తున్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.

English summary
Defence Minister Rajnath Singh invoked emergency provisions on Friday to grant the Armed Forces special powers. This decision will enable the Armed Forces to set up and operate Covid-19 quarantine centres and hospitals. Over the past month, all three arms of the Armed Forces have been roped in to assist the country in the fierce battle against the second wave of the coronavirus pandemic. The DRDO and ITBP have already set up isolation and treatment facilities for Covid patients in Delhi, Lucknow and other parts of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X