ప్రపంచ ఉగ్రవాదికి పాక్ రూ.14 కోట్లా నజరానా ? అక్కడ భారత్ తీవ్ర అభ్యంతరం..!

పహల్గాం తీవ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే ఇందులో 14 మంది కుటుంబ సబ్యుల్ని కోల్పోయిన మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజహర్ కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్ల పరిహారం ప్రకటించింది. ఈ సాయం త్వరలోనే ఆయనకు అందించబోతున్నారు. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పాకిస్తాన్ మెడకు చుట్టుకునేలా ఉంది. పాకిస్తాన్ నిర్ణయంపై భారత్ ఇవాళ తీవ్రంగా స్పందించింది.

భారత్ లో పార్లమెంట్ పై దాడి సహా పలు కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది మసూద్ అజహర్ కు రూ.14 కోట్ల పరిహారం అందించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న తీవ్రవాద నెట్ వర్క్ ను తిరిగి నిర్మించుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ కు ప్రకటించిన 7500 కోట్ల సాయంపై ప్రపంచ బ్యాంక్ పునరాలోచించుకోవాలని కోరారు.

defence minister Rajnath singh ask IMF to rethink loan to Pakistan amid 14cr gift to masood azhar

పాకిస్తాన్ లోని మురిద్కే, బహవల్పూర్‌లలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించిందని రాజ్ నాథ్ ఆరోపించారు. ప్రపంచ బ్యాంక్ నుండి వచ్చే బిలియన్ డాలర్లలో గణనీయమైన భాగం ఖచ్చితంగా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడుతుందని తెలిపారు. దీనిని ప్రపంచ బ్యాంక్ ఉగ్రవాదనికి పరోక్ష నిధులుగా పరిగణించదా అని ప్రశ్నించారు.

పాకిస్తాన్ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఐరాస మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిపై ఖర్చు చేయాలనుకుంటోందని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. కాబట్టి ప్రపంచ బ్యాంక్ వెంటనే పాకిస్తాన్ కు ఇవ్వదల్చుకున్న 140 మిలియన్ డాలర్ల సాయంపై పునరాలోచించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+